రెరా రాక.. కష్టాలు తీరేను ఇక!


Sat,July 14, 2018 12:14 AM

realrera
ఎన్నో వేల అడుగులు వేస్తే తప్ప.. సొంతింట్లో సంతోషంగా స్థిరపడలేం. ప్రధానంగా, డెవలపర్ నుంచి ఇల్లు కొనుక్కుని.. అందులో అడుగుపెట్టడానికి అదృష్టం ఉండాలేమో! హైదరాబాద్‌లో పలువురు డెవలపర్ల వద్ద ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారిని చూస్తే ఇది నిజమేననిపిస్తోంది. పొదుపు చేసిన కష్టార్జితానికి తోడుగా బ్యాంకు రుణం తీసుకుని సొంతిల్లు కొంటే.. అందులోకి అడుగుపెట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే, కొనుగోలుదారులతో కొందరు డెవలపర్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. గడువులోపు ఫ్లాట్లను అందించకుండా.. నాలుగు, ఐదేండ్ల పాటు ఫ్లాట్లను నిర్మిస్తూ.. కొనుగోలుదారుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. దీంతో, అధిక శాతం మంది నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో ఫ్లాట్లను కొనడానికి సాహసించట్లేదు. అయితే, అందరూ అలా ఉన్నారని కాదు కానీ, ప్రణాళికాలోపం కారణంగా కొందరు డెవలపర్లు చేసే పొరపాట్లు వల్ల కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి ఇబ్బందులన్నీ తెలంగాణ రాష్ట్రంలో అతిత్వరలో తీరనున్నాయి. ఆగస్టు నెల నుంచి రెరా మన రాష్ట్రంలో అమలు కానుండటంతో.. ఇంటి కొనుగోలుదారులెంతో నిశ్చింతగా ఉండొచ్చు. నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లను కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ, డెవలపర్ సకాలంలో ఫ్లాటును అందించకపోతే, రెరాకు ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. ఆ అథారిటీయే మన సమస్యను పరిష్కరిస్తుంది.

273
Tags

More News

VIRAL NEWS