పీసీ స్లో అయ్యిందా?


Wed,September 12, 2018 01:02 AM

tech-tips

ప్రస్తుత డిజిటల్ యుగంలో కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ల వాడకం చాలా పెరిగిపోయింది. దీంతో సని చేయడంలో అవి కాస్త నెమ్మదిస్తున్నాయి. స్లో అయిన మీ కంప్యూటర్ వేగంగా పనిచేయాలంటే ఈ చిట్కాలు పాటించండి

-మీ కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లో ఉండే సీ, డీ, ఈ, ఎఫ్ డ్రైవ్‌లు
ఎప్పటికప్పుడు క్లీన్ చేయండి. ఇలా చేస్తే కంప్యూటర్ పనివేగం పెరుగుతుంది.
-మై కంప్యూటర్‌లో డ్రైవ్‌లోకి వెళ్లి రైట్ క్లిక్ ఇవ్వండి. ప్రాపర్టీస్‌లో టూల్స్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకొని డీఫ్రాగ్మెంట్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంప్యూటర్‌లో పేరుకుపోయిన ట్రాష్ అంతా పోయి, కంప్యూటర్ వేగంగా పనిచేస్తుంది.
-ఎప్పటికప్పుడు టెంపరరీ ఫైల్స్ డిలీట్ చేసేయండి.
-స్టార్టప్ ఆప్షన్‌లో అవసరం లేని ప్రోగ్రాములు డిసేబుల్ చేయండి. రన్‌లోకి
వెళ్లి ఎంఎస్ కన్‌ఫిగర్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. వచ్చిన విండోలోని స్టార్ట్‌అప్ ట్యాబ్‌లోకి వెళ్లి అక్కర్లేని ప్రోగ్రామ్స్ అన్‌చెక్ చేసి, సిస్టమ్ రీస్టార్ట్ చేయండి.
-డెస్క్‌టాప్ మీద తక్కువ ఐకన్లు ఉండాలి. ఎక్కువ మెమొరీతో
కూడిన ఫైల్స్ పెట్టకపోవడమే మంచిది.
-అవసరం లేని సాఫ్ట్‌వేర్లు ఎప్పటికప్పుడు తీసేయండి.
-యాంటీ వైరస్‌ను అప్‌డేట్ చేయడం ద్వారా పీసీలో
జంక్‌ఫైల్స్ స్టోర్ కాకుండా కాపాడుకోవచ్చు.
-రీసైకిల్ బిన్‌లోని అనవసర ఫైల్స్‌ని డిలీట్ చేయండి. పీసీ వేగం పెరుగుతుంది.
-సిస్టమ్ సాఫ్ట్‌వేర్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోండి.

674
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles