మంచి కోసం.. జట్టుకట్టారు!


Sat,September 8, 2018 11:01 PM

మంచి చెయ్యాలన్న ఆలోచన, సాయం అందించాలనే తపనతో ఏర్పడిందే ఈ షీ క్రియేట్స్ చేంజ్ గ్రూపు. ప్రస్తుతం కేరళ వరద బాధితులకు తమ వంతుగా సాయం అందిస్తున్నారు ఈ గ్రూపులోని మహిళలు. ఎక్కడెక్కడో మహిళలంతా ఓ సమూహంగా ఏర్పడి ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు.
Women's-Group
వీరంతా ఎక్కడెక్కడి వారో. నిత్యం వారివారి పనుల్లో బిజీగా ఉంటూనే సమాజ సేవలో తమవంతుగా ముందుంటున్నారు. చేంజ్ డాట్ ఆర్గ్ సంస్థకు చెందిన పదిమంది మహిళలు షీ క్రియేట్స్ చేంజ్ అనే వాట్సప్ గ్రూప్‌ను క్రియేట్ చేశారు. ఇందులో వేల సంఖ్యలో సభ్యులుగా ఉన్న మహిళలు.. దేశంలో ఎక్కడ విలయాలు, వరదలు, ప్రమాదాలు జరిగినా తమవంతు సాయం అందిస్తున్నారు. ప్రస్తుతం కేళర వరద బాధితుల్లో దాదాపు పదివేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సాయమందించారు. వీరు ఎక్కడెక్కడో ఉన్నా, పలు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నా.. ఒక్క మెసేజ్‌కు దగ్గర్లోనే ఉంటారు. సోషల్ మీడియా వేదికగా వీరంతా ఏకమై.. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు.


వీరిలో వివిధ హోదాల్లో ఉన్న మహిళలు, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ఆర్మీ, నేవీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో మమేకమై ప్రమాద తీవ్రతను తెలుసుకొని వారి వంతుగా సాయమందిస్తున్నారు. పేరుకు తగ్గట్టుగానే మహిళలు మార్పు కోసం పనిచేస్తారని నిరూపిస్తున్నారు. ఒక్క కేరళ సంఘటనే కాదు.. గతంలో దేశంలో జరిగిన పలు ప్రకృతి విలయాలు, ప్రమాదాలు, తుపాను, వదర బాధితులకు పలు రకాలుగా సాయమందించారు. సోషల్ మీడియా వేదికగా ఈ మహిళా బృందం చేస్తున్న కృషిని పలువురు అభినందిస్తున్నారు.

628
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles