సాహో.. ఎరీనా


Mon,July 31, 2017 01:31 AM

పదేళ్లు నిండకుండానే జీవితం ఏంటో తెలుసుకున్నది. ఏడుగురు అక్కాచెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్ల బాధ్యతలను చూసుకున్నది. తండ్రి చనిపోవడంతో కుటుంబాన్ని భుజానవేసుకున్నది. ఆమె ధైర్యానికి కాలమే ఓడిపోయి సాహో అన్నది.
Rajasthan-Girl
రాజస్థాన్‌కు చెందిన ఎరీనా.. చిన్నతనంలోనే జీవితాన్ని చదివింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు తొమ్మిదేళ్ల వయసులోనే ఇల్లిల్లూ తిరుగుతూ పేపర్ వేసింది. తండ్రి చనిపోవడంతో కుటుంబ భారాన్ని భుజాన వేసుకుంది. ఉదయం పేపర్ వేస్తూ, మధ్యాహ్నం చదువుకుంటూ, సాయంత్రం నర్సుగా పనిచేసింది. దీంతో కొన్నిసార్లు స్కూల్‌కు వెళ్లడం ఆలస్యం కావడంతో.. తన ఆర్థిక పరిస్థితి తెలుసుకోలేని ప్రిన్సిపల్ టీసీ ఇచ్చాడు. తర్వాత ఓ ప్రైవేట్ పాఠశాలలో చేరి పార్ట్‌టైం జాబ్ చేసింది.

ఆ డబ్బులు తోబుట్టువుల చదువులకు ఖర్చుచేస్తూ.. తానూ ఓ ప్రైవేట్ కాలేజీలో చేరింది. ఇటు ఫుల్‌టైం జాబ్.. అటు పార్ట్‌టైం క్లాసులు. ఇలా కుటుంబాన్ని నెట్టుకొచ్చింది ఎరీనా. పసితనం నుంచి జీవితాన్ని గెలువడానికి ఎరీనా చేసిన పోరాటం స్థానికులను ముక్కున వేలేయించింది. హైకోర్టు న్యాయమూర్తి భండారి శ్రీ రాజీవ్ ఆరోరా ఫెడరేషన్ ఆఫ్ రాజస్థాన్ ఎక్స్‌పోర్ట్ వారి నుంచి బ్రేవరీ అవార్డు ఇప్పించారు. ఆ తర్వాత కిరణ్ బేడీ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నది. ప్రస్తుతం రాజస్థాన్‌లో ప్రముఖ వ్యాపారవేత్తలు నడిపిస్తున్న.. ఫెడరేషన్ ఆఫ్ రాజస్థాన్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నది.

424
Tags

More News

VIRAL NEWS