యూపీ నుంచి తొలి క్రీడాకారిణి...


Sun,August 6, 2017 10:47 PM

అవును.. అక్కడ ఇంతవరకూ మహిళా క్రీడాకారిణి అర్జున అవార్డు గెలుచుకోలేదు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని, మహిళగా మరెన్నో అవమానాలను భరించి.. విజయబావుటా ఎగరవేసింది. తనతోపాటు తోబుట్టువులు కూడా పేరుగాంచిన బాస్కెట్‌బాల్ క్రీడాకారులే. ఇంతకీ వారు ఎవరు..?
ladies
తెలిసిన వాళ్లు టక్కున చెప్పేస్తారు వాళ్లు కచ్చితంగా సింగ్ సిస్టర్స్ అని. ఆ సిస్టర్స్‌లో ఒకరైన ప్రశాంతి సింగ్.. జాతీయ ఉన్నత పురస్కారం అర్జున అవార్డుకు నామినేట్ అయింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ సింగ్ సిస్టర్స్.. బాస్కెట్‌బాల్ క్రీడలో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారిణులు. అంతర్జాతీయ స్థాయిలు దేశం తరఫున ఆడుతున్న ప్రశాంతి సింగ్.. 2006 కామన్‌వెల్త్ గేమ్స్, 2010, 2014 ఆసియా గేమ్స్‌లో కీలక పాత్ర పోషించింది. 2002లో జరిగిన ఆసియన్ మూడో ఇండోర్ గేమ్స్‌లో బాస్కెట్‌బాల్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించింది. 2011లో శ్రీలంకలో జరిగిన ఆసియన్ బీచ్ గేమ్స్‌లో బాస్కెట్‌బాల్ తరఫున ప్రశాంతి గోల్డ్‌మెడల్ సంపాదించింది. దీంతో ప్రశాంతి సెలబ్రెటీ అయిపోయింది. ఈ సింగ్ సిస్టర్స్ టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మకు మరదళ్లు. తన నలుగురు అక్కచెల్లెళ్లు కూడా క్రీడాకారిణులే. దివ్య, ఆకాంక్ష, ప్రతిమా బాస్కెట్‌బాల్ నేషనల్ టీంలో ఆడుతున్నారు. మరో సోదరి ప్రియాంక నేషనల్ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్‌లో కోచ్‌గా విధులు నిర్వహిస్తుంది. ప్రశాంతి గౌరవప్రదమైన అర్జున అవార్డుకు ఎంపిక కావడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

362
Tags

More News

VIRAL NEWS