ఇయర్ బడ్స్ ఉపయోగాలు!


Sat,October 27, 2018 01:24 AM

మహిళలు ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచడానికి ఇష్టపడతారు. కానీ చేతితో తుడువడానికి వీలు కాని ప్రదేశాలను మాత్రం వదిలేస్తున్నారు. ఇయర్ బడ్స్ మూలల్లో దాగి ఉన్న దుమ్ము, ధూళిని సైతం వదిలిస్తుంది.

earbuds
-కంప్యూటర్ కీబోర్డు కీస్ మధ్యలో దుమ్ము, ధూళి ఇరుక్కుంటుంది. దాన్ని చేతులతో శుభ్రపరుచడానికి అంత వీలుపడదు. ఎలాంటి కష్టతరమైన ప్రదేశాల్లో అయినా ఇయర్ బడ్స్‌తో శుభ్రపరుచవచ్చు.
-ఇప్పుడు ఎక్కువగా అద్దాల కిటికీలనే పెట్టించుకుంటున్నారు. ఫిట్ చేసిన ప్రదేశాల్లో ఎక్కువ మొత్తంలో దుమ్ము చేరుతుంది. ఎప్పటికప్పుడు ఇయర్ బడ్స్‌తో శుభ్రపరిస్తే అద్దాలు మెరుస్తుంటాయి
-ఎప్పుడూ చేతిలో ఉండే టీవీ రిమోట్‌కి చాలా మట్టి అంటుకొని ఉంటుంది. ఇయర్ బడ్స్‌ని డిటర్జెంట్‌లో ముంచి రిమోట్‌ని తుడిస్తే శుభ్రంగా ఉంటుంది.
-లెదర్ సోఫా ఇంట్లో ఉంటే దుమ్ము కూడా ఉన్నట్టే. ఎలా అంటారా? సోఫా మూలల్లో ఎక్కువగా మట్టి చేరుతుంది. చేతితో తుడువలేక వదిలేస్తుంటారు. ఇయర్ బడ్స్ ఎంత చిన్న మూలల్ని అయినా శుభ్రపరుస్తుంది.
-గాజుతో చేసిన టేబుల్‌ని వాడుతున్నట్లయితే, ఫిట్ చేసిన ప్రదేశంలో బట్టతో శుభ్రపరుచలేక నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారా? ఇయర్ బడ్స్‌ని వెనిగర్‌లో ముంచి తుడిస్తే ఎంతటి మురికైనా వదులుతుంది.

731
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles