మీసం మెలేయ్ చిన్నా..


Wed,August 29, 2018 01:21 AM

మా తాత మీసాలపై నిమ్మకాయలు నిలబెట్టేవాడు అని అప్పుడెప్పుడో చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ స్మార్ట్ కాలంలో యువకులంతా చాలా స్మార్ట్‌గా తయారవుతుండటంతో మీసాలు, గడ్డాలు పెంచేవారి సంఖ్య తగ్గిపోయింది. దీంతో మీసాలు, గడ్డాలు పెంచేలా యూత్‌ను ప్రోత్సహించేందుకు విచిత్రంగా పోటీలు నిర్వహిస్తున్నారు.
Meesala-Pot
ఇంగ్లండ్‌లోని నార్త్ ఇంగ్లిష్ టౌన్ ఆఫ్ బ్లాక్ పూల్లో మీసాలు, గడ్డాల పోటీలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ పోటీలకు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 200 మందికిపైగా అభ్యర్థులు వచ్చేశారు. మొత్తం 21 విభాగాల్లో జరిగే ఈ పోటీలను చూసేందుకు ఔత్సాహికులు కూడా భారీగా వచ్చేశారు. వయసు, జాతి, మతాలతో సంబంధం లేకుండా మీసాలు మెలేస్తూ, గడ్డాలు నిమురుతూ పోటీలకు సై అంటున్నారు. ఈ పోటీల్లో పాల్గొంటున్న ఒక్కొక్కరిదీ ఒక్కో కేశాలంకరణ. ఏ ఒక్కరూ కూడా ఒకేలా గడ్డాలు, మీసాలు పెంచలేదు. ఈ పోటీల్లో యువకులు తెగ సందడి చేస్తున్నారు. అయితే, ఈ పోటీల్లో పెట్టుడు మీసాలు, గడ్డాలు ఉన్నవాళ్లూ ఉన్నారు. ఫైనల్‌లో అత్యుత్తమ గడ్డం, అత్యుత్తమ మీసం, పూర్తి గడ్డం, ఫ్రీైస్టెల్ వంటి విభాగాల్లో బహుమతులు ఇస్తారు. ఈ పోటీల్లో పాల్గొన్నవారంతా తమ మీసాలను, గడ్డాలను అమితంగా ప్రేమిస్తున్నవారే. ఈ పోటీల్లో యూరోపియన్లు, ఆంగ్లేయులు, బ్రిటీషర్లు వెరైటీ కేశాలంకరణలతో అలరిస్తున్నారు. ఈ పోటీలు ప్రతి రెండేండ్లకొకసారి జరుగుతుంటాయి కాబట్టి, వీటికి మంచిపేరుంది. అయితే, ఈ పోటీల్లో పాల్గొనే వారి సంఖ్య ప్రతియేటా పెరుగుతుందని, వారిలో యువకులే అధికంగా ఉన్నారని నిర్వాహకులు చెబుతున్నారు.

981
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles