టైడ్ ప్యాడ్ చాలెంజ్


Wed,September 19, 2018 01:40 AM

ప్రమాదాలను గమనించకుండా చాలెంజ్‌ల పేరుతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు నేటి యువకులు. చాలెంజ్‌ల ట్రెండ్ నడుస్తున్న ఈ కాలంలో.. కొత్తగా మరో ట్రెండ్ వచ్చేసింది. అదే టైడ్‌ప్యాడ్ చాలెంజ్. ఆ కొత్త చాలెంజ్ విశేషాలు మీ కోసం.
POD
సోషల్ మీడియాను ప్రస్తుతం మరో చాలెంజ్ షేక్ చేస్తున్నది. అదే టైడ్‌ప్యాడ్ చాలెంజ్. దీని ఉద్దేశం ఏంటంటే డిటర్జెంట్ బిళ్లల రూపంలో ఉన్న ఫ్రూట్స్, స్వీట్స్ తినడం. పిల్లలు చిన్నతనంలో ఏది తినాలో తెలియక చేతికి దొరికిన సబ్బుళ్లు, సర్ఫ్‌లు తినేవాళ్లు. దీంతో వారు అనారోగ్యం బారిన పడేవారు. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. ప్రస్తుత యువత ఆ చాలెంజ్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. డిటర్జెంట్ రూపంలో ఉన్న ఫ్రూట్స్, స్వీట్స్, రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని క్యాప్సూల్స్‌గా తీసుకోవడం ఈ చాలెంజ్‌లో భాగం. అయితే, ఈ చాలెంజ్ ఉద్దేశం మంచిదే అయినా, ప్రస్తుతం దీనిపైనా సోషల్ మీడియాలో కొన్ని విమర్శలు వస్తున్నాయి. అమెరికాలో ఈ చాలెంజ్‌కు బాగా క్రేజ్ పెరుగుతున్నది.

484
Tags

More News

VIRAL NEWS