దేశీ డిస్నీ ప్రిన్సెస్!


Tue,January 16, 2018 11:08 PM

డిస్నీ ప్రిన్సెస్‌ని చూసి మైమరచి పోతుంటారు చాలామంది. ఇప్పుడు మన దేశీ డిస్నీ ప్రిన్సెస్ ఎలా ఉంటుందో తెలియాలని ఈ అమ్మాయి ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పెడుతున్నది.
disney
రాకుమారి ఎలా ఉంటుంది? తెల్లగా, అందంగా.. పొడవాటి జుట్టుతో మెరిసిపోతుంది. ఏ అబ్బాయి అయినా తన కలల రాకుమారి కూడా అలాగే ఉండాలని ఊహించుకుంటాడు. ప్రతీ అమ్మాయి కూడా ఆ రాకుమారిలా మారిపోవాలని అష్టకష్టాలూ పడుతుంటుంది. కానీ ఇన్ని తిప్పలు అవసరమా? ఆ డిస్నీ రాకుమారి మనల్ని పక్క దోవ పట్టించేసిందని భావించిందో అమ్మాయి. నల్లగా ఉండి కూడా అందంగా ఉండొచ్చనే సమాచారం అందరికీ చేరాలనుకుంది. మేకప్ ఆర్టిస్ట్, మోడల్ అయిన హమీల్ పటేల్ ఈ కార్యానికి నాంది పలికింది. అందరికీ నచ్చే డిస్నీ ప్రిన్సెస్‌లా తాను మారాలనుకుంది. కానీ దేశీ అవతార్‌లో. రకరకాల గెటప్‌లు వేసుకొని ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. విపరీతమైన క్రేజ్ వచ్చి ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

544
Tags

More News

VIRAL NEWS

Featured Articles