రక్త సరఫరాను గుర్తిస్తుంది!


Wed,September 5, 2018 10:56 PM

టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మార్కెట్‌లోకి కొత్త కళ్లజోడును తీసుకురానున్నది. దీనిని ధరించిన వారిని గుండె, రక్త సంబంధిత ప్రమాదాల నుంచి కాపాడుతుంది. అంతేనా.. ఇంకా చాలా ఉన్నాయ్ ఈ కళ్లజోడు ప్రత్యేకతలు.
Eye-Speds
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అతి త్వరలో హైటెక్ కళ్లజోడును మార్కెట్‌కు పరిచయం చేయనున్నది. ఏంటి? దీని ప్రత్యేకత అంటే.. ప్రతి ఐదు, పది నిమిషాలకు రక్త సరఫరాను అంచనా వేస్తుంది. బ్లడ్ ప్లజర్, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలను ముందే పసిగడుతుంది. శరీరంలోని అన్ని భాగాలకు రక్తం సరఫరా అవుతుందా లేదా అని మానిటరింగ్ చేస్తుంది. ఈ కళ్లజోడు ముఖ్యంగా గుండెకు రక్షణ కవచంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. హై బీపీ, లోబీపీ వంటి సమస్యలను అంచనా వేసి, వెంటనే మనకు తెలియజేస్తుంది. ఇందులోని సెన్సర్లు శరీరంలో రక్తసరఫరాను గమనిస్తూ ఉంటాయి. ముక్కు, చెవులకు ఇవి అమర్చబడి ఉంటాయి. ఇవి తల, మెడ, ముక్కు, చర్మం నుంచి ధమనుల రక్తసరఫరాను అంచనా వేస్తాయి. భుజం ఉన్న ప్రాసెసర్‌లోకి ఫలితాలను పంపుతాయి. ప్రాసెసర్ ద్వారా ఫలితాలను విశ్లేషించి రక్తపోటు, గుండె, నరాల సంబంధిత వ్యాధులను గుర్తిస్తారు. ఇప్పటి వరకూ ఐదురోజులు వాటిని ధరించిన నలుగురు వ్యక్తులపై పరిశోధనలు చేశారు. ఇది అందుబాటులోకి వస్తే.. చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.

556
Tags

More News

VIRAL NEWS