యంగ్ స్పైడర్‌మ్యాన్!


Tue,August 28, 2018 11:18 PM

పట్టుమని పదిహేనేళ్ల వయసు. టీనేజ్ ఆలోచనలు. ఎవ్వరైనా ఏం చేస్తారు. తోచింది చేస్తారు. నచ్చినట్టు వ్యవహరిస్తారు. కానీ ఈ యంగ్ స్పైడర్‌మ్యాన్ ఏం చేస్తున్నాడో తెలుసా?
spider-man
మైబమ్ స్పీడ్ ైక్లెంబింగ్‌లో రికార్డులను బద్దలు కొట్టాడు. పదిహేను మీటర్ల గోడను 7.10 సెకన్లలో ఎక్కాడు. మణిపూర్‌లో పుట్టిన మైబమ్ 2015లో జరిగిన ఏషియన్ యూత్ చాంపియన్ షిప్‌లో గోల్డ్ మెడల్స్ సాధించాడు. ఫుల్‌బాల్ ఆడుకునే మైబమ్ సోదరులు సరదాగా ఇంట్లో వాల్ ైక్లెంబింగ్‌ను సెట్ చేసుకున్నారు. రోజూ ఫుట్‌బాల్ తర్వాత ప్రాక్టీస్ చేసేవారు. మైబమ్ మాత్రం ైక్లెంబింగ్‌లో కిక్ వెతుక్కున్నాడు. సీరియస్‌గా తీసుకున్నాడు. పదిహేను యేండ్ల వయసులో చదువుకుంటూనే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటూ కెరీర్ మీద దృష్టి పెట్టాడు. ఈ సారి ఏషియన్ గేమ్స్‌లో పాల్గొని తన సత్తా చాటనున్నాడు. అదృష్టాన్ని పరీక్షించుకోవడం కాదు.. ఆట ప్రదర్శించి గెలుపు సాధిస్తానని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అతడు గోడలు ఎక్కే తీరు, పరుగెత్తే తీరును చూసి అతని మిత్రులు, బంధువులు యంగ్ స్పైడర్‌మ్యాన్ అని పిలువడం ప్రారంభించారు. అప్పటి నుంచి మైబమ్ మరింత ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు.

591
Tags

More News

VIRAL NEWS