అందమే ఆనందం!


Sat,November 3, 2018 12:59 AM

skincare
-బాదం పొడి, పాలను బాగా కలిపి అందులో కొంచెం ఓట్‌మీల్, తేనె వేసి పేస్ట్‌లా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని మెడ, ముఖానికి రాయాలి. 15 నిమిషాల తరువాత నీటితో కడుగాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది.
-తేనె, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, చక్కెరలను వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి. 20 నిమిషాల తరువాత నీటితో శుభ్రపరుచాలి. తరుచూ ఇలా చేస్తే మెరిసిపోతారు.
-మయోనైస్, నిమ్మరసం, ఓట్‌మీల్, చక్కెరను కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 15 నిమిషాల తరువాత నీటితో కడుగాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే ముఖం మీద మచ్చలు పోతాయి.
-గ్రీన్ టీ, రోజ్ వాటర్, దానిమ్మ రసాన్ని బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిలో నిల్వ చేసుకోవచ్చు. మెడ, ముఖానికి స్ప్రే చేసి మర్దన చేయాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడుగాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.

505
Tags

More News

VIRAL NEWS

Featured Articles