చిన్న సమస్య.. పెద్ద నొప్పి!


Tue,September 25, 2018 12:47 AM

Migraine
ఏంటదీ అనుకుంటున్నారా? అదే పార్శపు నొప్పి. ఆ నొప్పి తెలియనివాళ్లు ఓస్.. గంతేనా? అంటారు. కానీ తెలిసిన వాళ్లు మాత్రం వామ్మో మైగ్రెయినా? అని జంకుతారు. మైగ్రెయిన్ ఉనికిని గుర్తించడం కష్టం కావచ్చు గానీ.. దాని దశలను మాత్రం ఇలా కచ్చితంగా గుర్తించవచ్చు.

మైగ్రెయిన్ నాలుగు దశలు ఇవీ..


1. ప్రొడోమ్: పార్శపు నొప్పి ప్రారంభానికి కొన్ని గంటల ముందు ఉంటుంది. దీనిని ప్రీ హెడేక్ లేదా ప్రీమానిటరీ అని కూడా అంటారు.
లక్షణాలు: అధిక చిరాకు, దాహం, శక్తి హీనత, నిద్రలేమి, తరుచూ మూత్రం.
2. మూడ్ స్వింగ్: వింత భావనలు కలగడం ఈ దశలో అధికంగా ఉంటుంది. సాధారణంగా ఈ దశ తలనొప్పికి కారకంగా ఉంటుంది. ప్రతి నలుగురిలో ఒకరికి దీనివల్ల పార్శపునొప్పి కలిగే అవకాశాలు ఉన్నాయి.
లక్షణాలు: దృష్టిలో మార్పులు, శరీరానికి సూదులు గుచ్చుతున్న అనుభూతి, నత్తి,

ఏకాగ్రత లోపం, గందరగోళం.


3. హెడేక్: పార్శపు నొప్పిలో ప్రధాన దశ ఇది. మూడ్రోజుల పాటు ఉంటుంది. నొప్పి ఒకవైపు
నుంచి మరోవైపునకు తరుచూ మారుతుంది.
లక్షణాలు: వికారం, వాంతులు, మూర్ఛ, కాంతి ప్రభావానికి
లోను కావడం, కిందికి వంగితే తలలో నొప్పి.

4. పోస్ట్ డ్రోమ్: దీనిని మైగ్రెయిన్ హ్యాంగోవర్ లేదా పోస్ట్ మైగ్రెయిన్ అంటారు. మైగ్రెయిన్ సమస్యలకు గురవుతున్నవారిలో 80% దాదాపు ఈ సమస్య కనిపిస్తుంది.
లక్షణాలు: బుద్ధిమాంద్యం, గందరగోళం, విపరీతమైన
తలనొప్పి, తీవ్ర అలసట.

271
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles