నాన్న కూతురు!


Mon,February 5, 2018 12:23 AM

నాన్నంటే ఇష్టమా? అమ్మంటే ఇష్టమా? కూతురంటే ఇష్టమా? కొడుకంటే ఇష్టమా? ఇష్టం గురించి ఇలా ఎందర్ని ఎన్నిసార్లు అడిగినా అందరూ ఇష్టమే అని చెప్తుంటారు కానీ.. పర్టిక్యులర్‌గా ఫలానా వాళ్లంటేనే ఇష్టం అని చెప్పలేరు. కుటుంబ బంధాలు అలాంటివి. బయటకు చెప్పినా.. చెప్పకపోయినా తండ్రులకు కూతుర్లంటేనే ఇష్టమట.
Daddy-Babies
అమ్మ ఇష్టం ఉన్నా.. నాన్నంటే ఇంకా ఇష్టమని చెప్పే కూతుర్లే ఎక్కువనీ.. నాన్నలకు కూడా కొడుకుపై కంటే కూతురుపైనే ఎక్కువ ప్రేమ ఉంటుందని అమెరికా అధ్యయనకారులు చెప్తున్నారు. అమెరికన్ సైకలాజికల్ అసోషియేషన్ ఆధ్వర్యంలో తాజాగా ఓ అధ్యయనం జరిగింది. పిల్లల గురించి పేరెంట్స్ స్పందన.. పేరెంట్స్ పట్ల పిల్లల స్పందనను ఈ అధ్యయనంలో భాగంగా పరిశీలించారు. దాదాపు 60 మంది నాన్నలపై కొన్ని మానసిక పరీక్షలు కూడా చేశారు. కూతుర్లు.. తల్లులతో మాత్రమే అన్నీ షేర్ చేసుకుంటారు అనే విషయంలో స్పష్టత లేదనీ.. తల్లులతో చెప్పుకోలేని అనేక విషయాలు తండ్రితో షేర్ చేసుకుంటారని నిపుణులు అభిప్రాయపడ్డారు. యాక్టివిటీస్.. వర్క్.. కెరీర్ వంటి విషయాల్లోని అన్ని ఎమోషన్స్‌ను ఒక్క తండ్రితో మాత్రమే చెప్పుకునే ధోరణి చాలామంది అమ్మాయిల్లో కనిపిస్తుందని చెప్పారు. నాన్న అయితేనే అన్ని రకాలుగా తమను అర్థం చేసుకుంటారనే ఆలోచనా ధోరణి కూతుళ్లలో ఉంటుందని తేటతెల్లం చేశారు. చాలామంది అనుకున్నట్లుగా నాన్న బయటకు కఠోరంగా కనిపించినా పిల్లల విషయంలో చాలా సున్నితంగా ఉంటారనీ.. అదే కోణంలో ఆలోచిస్తారని అన్నారు. ఆనందమొచ్చినా.. ఆపదొచ్చినా నాన్నతో చెప్పుకుంటేనే నిమ్మలంగా ఉండొచ్చనే భావన తాము పరిశీలించిన అమ్మాయిల్లో కనిపించిందని పేర్కొన్నారు. అందుకే అమ్మాయిలెప్పుడూ నాన్న కూతురుగానే ఉండాలని చూస్తారట!

1251
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles