మంజుల బొటిక్! నగలకు ప్రత్యేకం


Wed,September 5, 2018 01:15 AM

ట్రెండ్‌కు తగ్గట్టు ఉంటేనే ఏ వ్యాపారమైనా సక్సెస్ అవుతుంది. ఫ్యాషన్ ప్రియుల అభిరుచికి తగ్గట్టుగా ఉంటేనే ఆదరణ లభిస్తుంది. ఆ బాటలో ప్రయాణిస్తూ సరికొత్తగా జువెలరీ బొటిక్‌ని మొదలుపెట్టింది మంజుల.సంప్రదాయత ఉట్టిపడే నగనిగలను ఆవిష్కరిస్తూ ఇండియా నుంచి అమెరికా దాకా.. కామన్‌మ్యాన్ నుంచి సెలబ్రిటీల వరకూ.. విభిన్న నగల డిజైన్లతో అందర్నీ ఆకడుతున్న మంజుల జువెలరీ బొటిక్ అధినేత మంజులా రావు ప్రస్థానమే ఈరోజు కథనం.. పెండ్లిళ్లు.. ఫంక్షన్లు జరిగితే.. ఆడవాళ్ల మధ్య వచ్చే కామన్ టాపిక్‌లేంటి? అయితే చీరల గురించి.. లేదా నగల గురించే చర్చలు వస్తాయి. ఈ చీర ఎక్కడ కొన్నావు.. ఈ నగ ఎంత పెట్టి చేయించావు అని వాటి కొనసాగింపు మాటలు. ఈ మధ్యకాలంలో బట్టలకోసం ఎన్నో బొటిక్‌లు వెలిశాయి. నగల నాణ్యతా ప్రామాణాల కోసం జువెలరీ షాపులు వెలియడం కూడా చూస్తూనే ఉన్నాం. నమ్మకం ఉంటేనే నగల వ్యాపారం నడుస్తుంది. ఆ నమ్మకాన్ని సంపాదించడానికి ఎన్నో వ్యయప్రయాసలను దాటి వచ్చింది మంజుల రావు. పెద్దింట్లో పుట్టినా.. తనకంటూ ఒక గుర్తింపు కోసం ఎంతో శ్రమించింది. సక్సెస్ సాధించింది. ఇప్పుడు మంజుల జువెలర్స్ అనేది ఒక బ్రాండ్‌గా మారిపోయింది.
MANJULA
మంజుల పుట్టి, పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. ఎంఏ ఇంగ్లీష్ పూర్తయింది. ఆ తర్వాత పెండ్లి, పిల్లలు. లైఫ్ బిజీగా మారిపోయింది. కొన్నిరోజులు లెక్చరర్‌గా పనిచేసింది. అందులో క్రియేటివిటీ అనిపించలేదు. ఆ షెడ్యూల్స్ ఆమెకు సూటవలేదనిపించింది. ఆ తర్వాత భర్త వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. కన్‌స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ రంగాల్లోకి వచ్చింది. అందులో తను అందరి మీద సూపర్‌వైజ్ మాత్రమే చేసేది. దాంతో అందులోనూ తనకు సంతృప్తి లేదు. కానీ ఇంతకుమించి ఏం చేయాలనే ఆలోచన మాత్రం నిరంతరం ఆమె మనసులో మెదిలేది.

అనుకోకుండా..

మంజులది చిన్నప్పటి నుంచి క్రియేటివ్‌గా ఆలోచించే తత్తం. కానీ అందుకు తగ్గట్టుగా ఏ రంగంలో అడుగుపెట్టాలనేది మాత్రం నిర్ణయించుకోవడానికి కాస్త సమయం పట్టిందనే చెప్పాలి. భర్త గోల్డ్ మైనింగ్‌లోకి అడుగుపెట్టాడు. సౌతాఫ్రికాలో ఈ మైనింగ్ జరిగేది. అక్కడి నుంచి వచ్చేటప్పుడు విలువైన రత్నాలు, పచ్చలు తీసుకువచ్చేవారు. వాటిని ముంబైలోని జెమాలజీ వారికి చూపించి నగలు చేయించుకునేది. తనకు నచ్చినట్టు కస్టమైజ్ చేయించి ఆ నగలతో ఫంక్షన్లకు అటెండ్ అయ్యేది. అది చూసిన బంధువులు తమకు అలాంటి నగలే కావాలని కోరేవారు. అక్కడే తను ఎటు వైపు వెళ్లాలో అనే నిర్ణయానికి వచ్చింది. వెంటనే ముంబై వెళ్లి జెమాలజీ అండ్ డైమండ్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది.

బొటిక్ ప్రారంభం

జువెలరీ కోసం ఎన్ని షాపులు వెలిసినా వాటికి డిమాండ్ ఎప్పటికీ తగ్గదు. మనకు నచ్చిన నగ తక్కువ ధరలో.. మనం అనుకున్న బడ్జెట్‌లో వస్తే అంతకు మించి ఆనందం ఉండదు. ఇదే ప్రధాన మోటోగా పెట్టుకొని మంజుల జువెలరీని చిన్న గదిలో మొదలుపెట్టింది. నలుగురు వర్కర్స్‌ని పెట్టి కొన్ని నగలను చేయించింది. ఎగ్జిబిషన్ ఉందంటే అక్కడికి వెళ్లింది. తాను ఊహించింది ఒకటి.. అక్కడ జరిగింది మరొకటి. ఒక్క నగ అంటే.. ఒక్క నగ కూడా అమ్ముడు పోలేదు. అలా అనీ తన ప్రయత్నం ఆపేయాలనుకోలేదు. కానీ రెండు రోజుల తర్వాత ఒక ఫోన్ కాల్. ఎగ్జిబిషన్‌లో నగలను చూశాం నచ్చాయని. ఒక పెండెంట్ ఆర్డర్ వచ్చింది. అలా 2011లో తన బొటిక్ కెరీర్ మొదలైంది.
MANJULA1

ఆన్‌లైన్‌లో..

ఒక ఆర్డర్ మంజులలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మరొక ఆర్డర్ వచ్చినప్పుడు ఆ ఫొటోను వారు సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. అలా ప్రచారం మొదలైంది. మంజుల జువెలరీ పేరుతో ఫేస్‌బుక్‌లో పేజీ ప్రారంభించింది. ఆ పేజీ ప్రారంభించిన రెండు వారాల్లోనే అమెరికా, ఆస్ట్రేలియాల నుంచి కూడా ఆర్డర్లు పెరిగాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. బయట కంటే తక్కువ ధరలో ఇవ్వడం మంజుల ప్రత్యేకత. షాపులో వాళ్లు తరుగు, మేకింగ్ చార్జ్‌లంటూ బంగారాన్ని, డైమండ్స్‌ని ప్రియం చేస్తారు. కానీ మంజుల హల్‌మార్క్‌తో అదే బంగారాన్ని వారికంటే తక్కువ ధరలో అందించడంతో ఆమె బిజినెస్ పెరిగింది. దానికి తోడు ఆమె కస్టమైజ్డ్ నగలు చేస్తుండడంతో మెచ్చిన నగ పెట్టుకోవాలనే వారి ఆర్డర్లు పెరిగాయి.

సెలెబ్రిటీల నుంచి..

ప్రత్యేకమైన నగలను తయారుచేయడానికి మంజుల ఎంతో రీసెర్చి చేస్తుంది. ప్రకృతి.. గుళ్లోని ప్రతీ అణువు ఆమె డిజైన్లకు స్ఫూర్తినిచ్చాయంటున్నది. కుందన్, డైమండ్, పోల్కీ, గోల్డ్‌తో వివిధ డిజైన్ల నగలు ఇక్కడ చూడొచ్చు. ఎక్కువగా బ్రైడల్ జువెలరీ, సౌత్ ఇండియన్ చేయడానికి ఇష్టపడుతుంది మంజుల. 30 వేల నుంచి 40 లక్షల రూపాయల వరకు నగలు ఇక్కడ లభ్యమవుతాయి. ఈమె కస్టమర్లలో సెలెబ్రిటీల లిస్ట్ ఉంది. పెద్ద, పెద్ద హీరోయిన్లు మంజుల జువెలరీకి వస్తుంటారు. ఇటీవల విడుదలయిన శ్రీనివాస కళ్యాణం సినిమాలో పెండ్లి సన్నివేశంలో రాశీఖన్నా పెట్టుకున్న నగలు మంజుల జువెలరీవే! ఈ ఒక్క సినిమానే కాదు.. మరికొన్ని సినిమాల్లో కూడా మంజుల జువెలరీ నగలు మెరిసిపోయాయి.

పెద్ద ఎత్తున

నేను ఖాళీగా ఉండలేను. భర్త కోటి సంపాదించినా.. భార్య పదివేలు సంపాదించినా ఆ తృప్తి వేరుంటుంది. మా ఆయన టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు. ఆయన నేను ఏది చేయాలన్నా వెన్నంటి ప్రోత్సాహం అందించారు, అందిస్తున్నారు కూడా. ఆయన వద్దంటే నా కెరీర్ ఎప్పుడో ఆగిపోయేది. నా కుటుంబం కూడా నాకు ఎంతో సహకరిస్తున్నది. అకేషన్‌ని బట్టి, ఏ డ్రెస్‌కి ఎలాంటి నగలు పెట్టుకోవాలో కూడా కస్టమర్లు అడిగితే తెలియచేస్తాం. ఫేస్‌బుక్ పేజీలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్లను అప్‌లోడ్ చేస్తాను. ఒకవేళ ఆ నగకు కొన్ని మెరుగులు చెప్పి వారికి నచ్చిన రీతిలో చేసి ఇవ్వడం నా ప్రత్యేకత. త్వరలోనే జువెలరీ షాపు ఓపెన్ చేసే ఆలోచనలో ఉన్నాను. ఇంటర్నేషనల్‌గా కూడా మరింత వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటున్నా. వచ్చే లాభాల్లో కొన్ని సేవాకార్యక్రమాలకు కూడా వినియోగిస్తుంటా అంటున్నది మంజుల.
BANNER

సౌమ్య నాగపురి

శ్రీనివాస కళ్యాణం సినిమాలో పెండ్లి సన్నివేశంలో రాశీఖన్నా పెట్టుకున్న నగలు మంజుల జువెలరీవే!

765
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles