బరువు పెరుగడం లేదా?


Mon,February 19, 2018 01:32 AM

మీ పిల్లలు పౌష్టికాహారం లోపంతో బాధపడుతున్నారా? కండ పుష్టిలేక నీరసించిపోతున్నారా? అయితే ప్రోటీన్లు శరీరానికి అధికంగా అందించే ఈ ఆహారం పెట్టండి.
Child-Food
-పాల ద్వారా లభించే వెన్నలో ఆరోగ్యకరమైన కొవ్వులు కండపుష్టికి సాయపడుతాయి. పిల్లల ఆహారంలో వెన్నను భాగం చేస్తే సులభంగా బరువు పెరుగుతారు.
-పాలు, మీగడలో కూడా అధిక కేలరీలు ఉంటాయి. ప్రతిరోజూ రెండు గ్లాసుల పాలు తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది. తినడానికి ఏమైనా ఇవ్వాలనుకుంటే తృణధాన్యాలు, మీగడ ఉండేలా చూసుకోండి.
-తక్కువ ధరలో అధిక మాంసకృత్తులు అందించే ఆహారం కోడిగుడ్లు. రోజువారీ ఆహారంలో గుడ్డును చేర్చితే బరువు పెరుగడమే కాదు.. తెలివితేటలు కూడా పెరుగుతాయి.
-అధిక కేలరీలు ఉండి తక్షణమే శక్తినిచ్చే పండు అరటి. ఇవి పిండి పదార్థాలను అందించడమే కాకుండా, ఆరోగ్యకరమైన కొవ్వును పెంచుతాయి.
-చికెన్ కండరాలను పెంచడంలో సాయపడుతుంది. తక్కువ బరువుతో బాధపడే చిన్నారులకు రోజూ అవసరమైనంత చికెన్ తినిపించాలి.
-అవకాడో పండులో ఉండే కొవ్వు, పోషకాలు పిల్లల ఎదుగుదలకు దోహదం చేస్తాయి. క్రమం తప్పకుండా ఇవి తినడం వల్ల బరువు పెరుగుతారు.

1399
Tags

More News

VIRAL NEWS

Featured Articles