షుగర్ పేషెంట్ల కోసం స్వీట్స్!


Sun,November 11, 2018 11:42 PM

ఈమెకు తండ్రి అంటే చాలా ఇష్టం. ఆయన కూడా కూతురిని అంతే ప్రేమగా చూసుకునేవాడు. అయితే తండ్రికి ఉన్న డయాబెటిస్ వల్ల తనకిష్టమైన స్వీట్లు తినలేకపోయేవాడు. ఈ పరిస్థితిని తన చిన్నతనం నుంచి గమనిస్తున్న ఈ యువతి ఏం చేసిందో తెలుసా?
Sarrah-Kapasi
ముంబైకి చెందిన ఈ యువతి పేరు సారా కపసి. టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతున్న తన తండ్రి కపసి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యువతి ప్రత్యేకంగా స్వీట్లు తయారు చేయడం ప్రారంభించింది. ఇందుకు కోసం దేశ, విదేశాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో వెళ్లి మరీ తెలుసుకున్నది. ఆ పరిజ్ఞానంతో ఎలాంటి కెమికల్స్ వాడకుండా, సేంద్రియ పద్ధతిలో పండిన ఆహారపదార్థాలతో స్వీట్స్ తయారు చెయ్యడం ప్రారంభించింది సారా. వాటిని తీసుకుంటున్న తన తండ్రి శరీరంలో క్రమంగా ఇన్సూలిన్ స్థాయి పెరుగడం, షుగర్ లెవెల్స్ యథాస్థితికి రావడం గమనించింది. దీంతో తన తండ్రి సూచన మేరకు ఆమె డయాబెటిక్ స్వీట్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. కేవలం ఇంటివద్ద ఎలాంటి రసాయనాలు వాడకుండా వీటిని తయారు చేసి, డి-అలైవ్ స్వీట్స్ పేరుతో వాటిని మార్కెటింగ్ చేస్తున్నది. ప్రస్తుతం డి-అలైవ్‌కు తానే సీఈఓగా ఉంటూ పదిమందిని నియమించుకున్నది. ఆర్గానిక్ ఫుడ్‌తో పలురకాలుగా వస్తున్న ఈ స్వీట్స్‌కు మంచి ఆదరణ ఉన్నది. మార్కెటింగ్‌లో ఎలాంటి అనుభవం లేకపోయినా స్వశక్తితో ఎదిగి ఎంట్రపెన్యూర్‌గా మారింది సారా. డయాబెటిక్ రోగులు వీటిని విస్తృతంగా కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా వీటిని ఆన్‌లైన్‌లోనూ అమ్మేందుకు డి-అలైవ్ పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. మొత్తానికి తండ్రి కోసం చేసిన ఆలోచన వారి జీవితాలనే మార్చేసింది.

591
Tags

More News

VIRAL NEWS