దంతాల సంరక్షణకు..


Thu,August 30, 2018 01:15 AM

చిన్నప్పటి నుంచి దంతాలకు సరైన పోషణ ఇస్తేనే భవిష్యత్తులో బాగుంటాయి. పిల్లల దంతాల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారపద్ధతులు..
kids_dentistry
-పిల్లలు ఎదుగుతున్న క్రమంలో ఏది పడితే అది తినిపించకూడదు. ముఖ్యంగా నిల్వ ఉంచిన ఆహారాన్ని అస్సలు తినిపించవద్దు. తరచూ ఇలాంటి ఆహారం తినిపించడం వల్ల దంత క్షయాలకు దారి తీసే ప్రమాదం ఉంటుంది.
-సోడా, చల్లని పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్, తియ్యని టీ, కాఫీ వంటివి ఎక్కువ కాలం తీసుకోవడం వల్ల దంతాలకు త్వరగా పాడవుతాయి.
-చాక్లెట్లు, లాలీపాప్స్ దంతాలను నెమ్మదిగా తినేస్తుంటాయి. వాటికి ఎంత దూరం ఉంచితే అంత మంచిది.
-కూల్ కేక్స్, పేస్ట్రీలు, కుకీస్, బ్రౌనీస్ వంటి వాటిని తినకుండా చూసుకుంటే ఉత్తమం. చక్కెరలాంటి తీపి పదార్ధాలు మంచివి కావు.
-తాజా పండ్లు, కూరగాయలు పళ్లకు బలాన్నిస్తాయి.
-భోజనం తర్వాత చూయింగ్‌గమ్ నమిలితే దంత క్షయాన్ని నిరోధించవచ్చు.
-ఆహారం నమిలి తిన్నాక నీరు తాగాలి. తినేటప్పుడు తాగితే బ్యాక్టీరియా జామ్ అవుతుంది.
-పిల్లలు వాడే టూత్ బ్రష్‌లను ఎప్పటికప్పుడు మారుస్తుండాలి. ప్రతి ఆరునెలలకొకసారి డెంటల్ డాక్టర్‌ను సంప్రదిచాలి.

డాక్టర్
మయూరి ఆవుల
న్యూట్రిషియనిస్ట్
mayuri.trudiet
@gmail.com

846
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles