మరకలు వదిలించుకోండిలా!


Sat,May 26, 2018 01:45 AM

coffe
-కాఫీ మరక పడగానే ఆ ప్రాంతంలో చల్లటి నీరు పోసి కడిగేయాలి. ఇలా చేస్తే మరక వెంటనే పోతుంది.
-కాఫీ మరకను వదిలించుకోవడానికి బీరు మంచి చిట్కా. ఒక పొడి వస్ర్తాన్ని బీరులో ముంచి కాఫీ మరక పడిన వస్ర్తాన్ని రుద్దితే మరక మాయం.
-దుస్తులపై పడిన మరకలను పోగొట్టడంలో వెనిగర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలాంటి వెనిగర్‌కు కాఫీ మరక ఓ లెక్కా? కాఫీ మరక మీద కొద్దిగా వెనిగర్ చిలకరించి రెగ్యులర్ వాష్ చేస్తే మరక ఈజీగా పోతుంది.
-బేకింగ్ సోడాకు కేవలం వంటల్లోనే కాదు... మరకలను వదిలించడం కూడా తెలుసు. కొద్దిగా వేడినీళ్లను కాఫీ మరకల మీద పోసి కొద్దిసేపటి తర్వాత ఉతికితే మరక మాయం.
-గుడ్డులోని పచ్చసొన అందాన్నివ్వడానికే కాదు... దుస్తుల మీద మరకలు తొలగించడంలో కూడా బాగా పనిచేస్తుంది. బాగా గిలకొట్టిన గుడ్డు పచ్చసొనలో టెర్రీక్లాత్ ముంచి కాఫీ మరకలు పడిన దుస్తుల మీద రబ్ చేస్తే మరక ఈజీగా వదిలిపోతుంది.
-కేవలం కాఫీ మరకలు మాత్రమే కాదు... మొండి మరకలను సైతం క్లబ్ సోడా ఈజీగా పోగొడుతుంది. కాఫీ మరక మీద కొద్దిగా క్లబ్ సోడా చల్లి ఉతికితే ఎలాంటి మరకలైనా మటుమాయం కావాల్సిందే!

186
Tags

More News

VIRAL NEWS

Featured Articles