మార్పు కోసం..చమత్కారం!


Wed,January 17, 2018 01:29 AM

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఫేస్‌బుక్‌కు డిసెంబర్ 31 నుంచి క్రేజ్ బాగా పెరిగింది. అంతకుముందు కూడా ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉన్న ఈ పేజీ గత నెల రోజులుగా మాత్రం ఎక్కువ పాపులర్ అయ్యింది. లైకులు, ఫాలోవర్స్ అమాంతం పెరిగిపోయారు. కారణం అడ్మిన్ హెచ్. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఫేస్‌బుక్ పేజీ విభిన్న ధోరణులతో నెజటిజన్లను ఆకట్టుకుంటున్నది. ఈ పేజీకి తెరవెనుక ఉండి పనిచేస్తున్న వాళ్ల గురించి, వాళ్లు చేస్తున్న కార్యక్రమాలు, పెడుతున్న పోస్టుల గురించే ఈ కథనం.
రక్తదానం చేయండి. కానీ రోడ్లకు కాదు బిఫోర్ వైన్. ఇట్స్ ఫైన్. ఆఫ్టర్ వైన్ యూ పే ఫైన్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఫేస్‌బుక్ పేజీలోని మచ్చుకు రెండు పోస్టులివి. ఈ పోస్టుల్లో వ్యంగ్యం, బాధ్యత, అవగాహన ఇలా చాలా రకాల అంశాలున్నాయి. ఎత్తిపొడుస్తూ, చమత్కరిస్తూ పెట్టిన ఈ పోస్ట్‌లు సోషల్‌మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంటాయి.
మరి ఇవి పెట్టింది ఎవరు? అడ్మిన్ హెచ్ అంటే ఏంటి? ఎవరు? మార్పు కోసం చమత్కారాలను రాస్తున్న అడ్మిన్ హెచ్ పరిచయం.

PUTTING
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్లమీద వాహనదారులకు సేవలందించడమే కాకుండా ఇంటర్నెట్‌లో నెటిజన్ల హృదయాలనూ గెలుచుకుంటున్నారు. సామాజిక బాధ్యతతో అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఫేస్‌బుక్‌కు డిసెంబర్ 31 నుంచి క్రేజ్ బాగా పెరిగింది. అంతకుముందు కూడా ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉన్న ఈ పేజీ గత నెల రోజులుగా మాత్రం ఎక్కువ పాపులర్ అయింది. లైకులు, ఫాలోవర్స్ అమాంతం పెరిగిపోయారు. కారణం అడ్మిన్ హెచ్. ఏదైనా సరే మనం చేసే పని ఇతరులకు నచ్చాలంటే.. కొత్తదనం, సృజనాత్మకత ఉండాలి. వీటితో పాటు కొంత చమత్కారం, కొంత వ్యంగ్యం కావాలి. అడ్మిన్ హెచ్ అదే చేస్తున్నాడు(రు).

27 యేండ్ల హరినాథ్ రెడ్డి 2010 నుంచి ఈ పేజీకి అడ్మిన్‌గా ఉంటూ సేవలందిస్తున్నాడు. హరినాథ్ పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. 2009లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగంలో రిక్రూట్ అయ్యాడు. 2010 నుంచి ఫేస్‌బుక్ పేజీ బాధ్యతలు చూసుకుంటున్నాడు. ఓసారి వ్యంగంతో కూడిన ఒక పోస్ట్ పెట్టాడు హరినాథ్. దానికి ఊహించని స్పందన వచ్చింది. హాస్యం ఆరోగ్యకరమైనది అనే చిన్న విషయాన్ని గ్రహించిన హరినాథ్ రెడ్డి ఇదే అంశంపై ఏకాగ్రత పెట్టి పోస్టులు రాయడం ప్రారంభించాడు. నవ్వులు పంచుతూ బాధ్యతని గుర్తు చేయడం మొదలుపెట్టాడు.
ఇది ప్రభుత్వానికి సంబంధించినది. పైగా పోలీస్ వ్యవస్థకు సంబంధించినది కాబట్టి చెప్పాలనుకున్న విషయాన్ని పరిధులు దాటకుండా హాస్యం జోడించి చెప్తున్నాడు. ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి వార్తలు, ఫొటోలు తెప్పించుకుని బిఫోర్, ఆఫ్టర్ ఫొటోలు, వాటి తాలూకు ఫలితాలను పెడుతున్నారు. పేజీ ద్వారా ఆన్‌లైన్‌లో కైంప్లెంట్‌లను కూడా స్వీకరిస్తున్నారు. కేసులకు సంబంధించిన విషయాలను ఉన్నతాధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటున్నారు.

పెట్రోల్ బంకుల్లో ఇచ్చట సెల్‌ఫోన్ వాడరాదు అనే బోర్డులు పెడుతారు. ఇక్కడ పేటీఎం కరో అంటూ పక్కనే ఇంకో బోర్డు కనిపిస్తుంది. చిన్న అంశాన్ని లోతుగా ఆలోచించి ఈ పోస్ట్‌ను అడ్మిన్ హెచ్ పేరుతో పేజీలో పెట్టారు. కేవలం పోస్టులే కాకుండా.. సినిమాల్లోని సన్నివేశాల స్క్రీన్ షాట్‌లను, ఫొటో కామెంట్లను పెడుతున్నారు. ఈ పేజీకి షేక్ హిదాయతుల్లా, హరినాథ్‌రెడ్డిలు అడ్మిన్లుగా ఉన్నారు. వీళ్లిద్దరూ పేజీకి సంబంధించిన వ్యవహార బాధ్యతలను చూసుకుంటున్నారు. ముఖ్యంగా హరినాథ్ టెక్నాలజీని వాడుతూ యువతలో మార్పు కోసం వ్యంగంతో కూడిన పోస్టులు, భిన్నమైన చిత్రాలను ఈ పేజీలో పోస్ట్ చేస్తున్నారు. అంతేకాదు.. ఏదైనా ఒక అంశాన్ని ఎంచుకొని పోల్ నిర్వహిస్తుంటారు కూడా. భిన్నమైన అంశాల మీద పోల్ పెట్టడం వల్ల యువతను ఆకట్టుకోగలుతున్నారు. నగర యువతతో పాటు, ప్రపంచ దేశాల్లో ఉన్న నెటిజన్లు కూడా ఈ పేజీని ఫాలో అవుతున్నారు. ఆరోగ్యకరమైన వ్యంగ్యంతో అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఫేస్‌బుక్ పేజీకి సుమారు మూడు లక్షల లైక్స్ ఉన్నాయి.

566
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles