గోడలపై మరకలా?


Thu,September 20, 2018 12:53 AM

ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి గోడలకు పెయింటింగ్ వేయిస్తుంటారు. కానీ.. కొన్ని మరకల కారణంగా పెయింటింగ్ ఆకర్షణ తగ్గిపోతుంది. ఈ చిట్కాలను పాటిస్తే ఎలాంటి మొండి మరకలనైనా తొలిగించవచ్చు.
painting-walls
-వెనిగర్‌ను గోరువెచ్చని నీటిలో కలుపాలి. శుభ్రంగా ఉన్న బట్టను ఈ మిశ్రమంలో ముంచి పెయింటింగ్ గోడలపై తుడవాలి. ఇలా చేయడం వల్ల గోడ మీద ఉన్న మరకలను తొలిగించవచ్చు.
-డిటర్జెంట్, వెనిగర్, నీరును బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని మొండి మరకలున్న ప్రదేశంలో పది నిమిషాలపాటు ఉంచాలి. ఇలా చేస్తే గోడలపై ఉన్న మొండి మరకలు తొలిగి శుభ్రంగా అవుతాయి.
-వెనిగర్, నీటిని కలుపాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిలో నింపి మరకలు ఉన్న ప్రదేశంలో స్ప్రే చేయాలి. బాగా నానిన తరువాత శుభ్రమైన బట్టతో మరకలను రుద్దాలి. దీంతో దీర్ఘకాలిక మరకలను తొలిగించవచ్చు.
-వెనిగర్‌లో కొంచెం నూనెను కలుపాలి. ఈ మిశ్రమాన్ని చెక్క ప్యానెల్ మీది మరకలకు పూయాలి. ఇలా చేయడం వల్ల చెక్కను రక్షించడమే కాకుండా ప్యానెల్ మెరుస్తూ కనిపిస్తుంది.
-వెనిగర్, బేకింగ్‌సోడా, గోరువెచ్చని నీటిని బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని గోడలపై ఉన్న మొండి మరకల మీద చల్లాలి. పది నిమిషాల తరువాత పొడిబట్టతో రుద్దితే ఎలాంటి మరకలైనా సులువుగా తొలగుతాయి.

530
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles