నెయిల్ పాలిష్ ఉపయోగాలు!


Sun,October 28, 2018 11:17 PM

నెయిల్ పాలిష్ అంటే గోళ్లు కలర్‌ఫుల్‌గా కనిపించడానికి మాత్రమే అనుకుంటాం. కానీ, దానివల్ల చాలా ప్రయోజనాలున్నాయంటే నమ్ముతారా?
nail-palish
-ఎన్వలప్‌ను సీల్ చేసి పోస్ట్ చేస్తుంటాం. కొన్నిసార్లు ఇంట్లో గ్లూ స్టిక్ అయిపోతుంది. అలాంటప్పుడు ఎన్వలప్‌ని మడిచి గ్లూ స్టిక్ బదులు నెయిల్ పాలిష్ రాస్తే అంటుకోవడమే కాకుండా డిజైన్‌లా కూడా ఉంటుంది.
-సూదిలోకి దారం ఎక్కించాలంటే నానా అవస్థలు పడుతుంటారు. దారం చివరని నెయిల్ పాలిష్‌లో ముంచండి. దారాన్ని సులువుగా ఎక్కించవచ్చు.
-ఏ సమయంలో అయినా షూ లేసెస్ చివరలు తెలిపోతుంటాయి. అలాంటప్పుడు కొత్తవి కొననవసరం లేదు. మంచి రంగు ఉండే నెయిల్ పాలిష్‌తో లేసెస్‌ని అంటించుకోండి.
-టూల్ బాక్స్ హ్యండిల్ స్క్రూ ఎక్కువగా వదులవుతుంటే దానికి నెయిల్ పాలిష్ రాయండి. ఇలా చేయడం వల్ల చాలా రోజుల వరకు స్క్రూ ఊడిపోదు.
-కొన్ని సార్లు చొక్కా బటన్స్ ఊడిపోతుంటాయి. సమయానికి అదే రంగు దారం లేకుంటే, మీ దగ్గర ఉండే నెయిల్ పాలిష్‌తో బటన్స్‌ని అంటించుకోవచ్చు.
-తాళాలగుత్తికి అన్ని రకాల తాళంచెవులు కలిపి ఉంచుతారు. అన్నీ కలిసుండడం వల్ల కన్ఫ్యూజ్ అవుతుంటాం. నెయిల్ పాలిష్‌తో గుర్తులు పెట్టుకుంటే సులువుగా గుర్తుపట్టొచ్చు.

581
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles