ఆధునిక ప్రకాశం!


Sat,October 6, 2018 01:22 AM

బిడ్డకు బలం తల్లిపాలే. కానీ మూఢనమ్మకాలు, లేనిపోని అపోహల వల్ల ఈ తరం తల్లులు బిడ్డకు పాలివ్వడానికి ఆలోచిస్తున్నారు. కానీ ఈ మధ్యే బ్రెస్ట్ ఫీడింగ్ ఒక ఉద్యమంలా మారుతున్నది. ఫేస్‌బుక్ ద్వారా ఆ ఉద్యమానికి ఊపు తెచ్చిన ఆధునిక ప్రకాశ్ ఈ ఏడాది ఫేస్‌బుక్ ఇచ్చే గ్లోబల్ అవార్డుకు ఎంపికైంది. ఈ సందర్భంగా ఆమె గురించి ఈ కథనం..
Summitee
నా జీవితంలో తొలి రెండు సంవత్సరాలు మా అమ్మ రొమ్ముపాలు తాగి పెరిగాను. నేనే కాదు.. అందరూ అలా పెరుగాల్సిన వారే అంటున్నది ఆధునిక ప్రకాశ్. నలుగురిలో బిడ్డకు పాలివ్వడానికి సిగ్గు పడుతున్న తల్లులకు కనువిప్పు కలిగిస్తూ.. బిడ్డకు పాలివ్వడానికి సిగ్గెందుకు? అందరూ తల్లి పాలు తాగే పెరుగుతారు. బ్రెస్ట్ ఫీడింగ్‌కు వెనుకాడకండి. బిడ్డ ఆరోగ్యానికి అవే ఔషధం అంటున్నది. బ్రెస్ట్ ఫీడింగ్ గురించి రెండేండ్ల క్రితం ఆమె తల్లిని నాకు పాలిస్తున్నప్పుడు నీకేమనిపించేది అమ్మా అని అడిగింది. తల్లి అభిప్రాయాన్ని, అనుభవాన్ని, అనుభూతిని తెలుసుకుంది ప్రకాశ్. బ్రెస్ట్ ఫీడింగ్ గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారోద్యమం చేస్తున్న ఆధునిక ప్రకావ్ సింబయోసిస్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివింది. పెండ్లయిన తర్వాత ఐర్లాండ్‌లో నివాసముంటున్నది.

2012లో ఆధునికకు తొలి సంతానం కలిగింది. ఆ సమయంలో తల్లిపాలు ఇవ్వడం పట్ల ఆమెను అనేక భయాలు చుట్టుముట్టాయి. తోటివారిని అడిగి అనేక సందేహాలు తీర్చుకుంది. తాను నివసించే కార్క్ పట్టణంలో స్థానికంగా ఉండే మదర్స్‌గ్రూప్‌లో చేరింది. బ్రెస్ట్ ఫీడింగ్ గురించి చదివి అనేక విషయాలు తెలుసుకున్నది. ఈ క్రమంలోనే త్వరగా ప్రసవం అయితే.. శిశువుకు బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలని తపన పడేది. ఓ బాబు పుట్టాడు. ప్రసవం అయిన ఏడు నెలల తర్వాత ఐరిష్ బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ గ్రూప్‌లో చేరింది. ఆ గ్రూప్‌లో చేరిన కొన్ని నెలల తర్వాత తానే స్వయంగా ఇతరుల సందేహాలు తీర్చడం మొదలుపెట్టింది. బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఇండియన్ మదర్స్ పేరుతో ఒక గ్రూప్ ఏర్పాటు చేసింది.

అందులో 82వేల మంది చేరారు. ఇండియా, యూఎస్, యూకే, ఆస్ట్రేలియాల నుంచి పెద్ద ఎత్తున తల్లులు ఈ గ్రూప్‌లో చేరారు. అప్పటి నుంచి బ్రెస్ట్ ఫీడింగ్‌ను ఒక ఉద్యమంలా మొదలుపెట్టింది. 2013 జూన్‌లో బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ గ్రూప్ మొదలు పెట్టిన ఆధునిక ప్రకాశ్ పుణేలోని తల్లులను గ్రూప్‌లో చేర్చడం, బ్రెస్ట్ ఫీడింగ్ మీద అవగాహన సదస్సులు నిర్వహించడం మొదలుపెట్టింది. ఫేస్‌బుక్ ప్రపంచవ్యాప్తంగా పలు ఉద్యమాలు, కార్యక్రమాలు చేస్తున్న వారికి గ్లోబల్ లీడర్స్ పేరుతో అవార్డు ఇస్తున్నది. ఈ ఏడాదికిగాను గత నెలలో నామినేషన్లు ఆహ్వానించింది. మిలియన్ డాలర్లతో పాటు గ్లోబల్ లీడర్ టైటిల్ ఈ అవార్డులో ఉంటుంది. అయితే ఈ అవార్డు కోసం ఆరువేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. అందులోంచి ఎంపికైన ఐదుగురిలో ఆధునిక ప్రకాశ్ ఒకరు. ప్రస్తుతం ఆమె ఇద్దరు పిల్లల తల్లి. వేలమంది తల్లులకు బ్రెస్ట్ ఫీడింగ్ పట్ల అవగాహన కల్పిస్తున్నది.
Summit1

నేను గ్రూప్ మొదలుపెట్టిన కొత్తలో అందులో బ్రెస్ట్ ఫీడింగ్ గురించి వచ్చే సందేహాలకు సమాధానాలు పెట్టేదానిని. బ్రెస్ట్ ఫీడింగ్ గురించి వాస్తవాలు పోస్ట్ చేసేదాణ్ణి. ఎప్పటికప్పుడు గ్రూప్ లైవ్‌లో ఉండేలా, యాక్టివ్‌గా ఉండేలా ప్రోగ్రామ్స్ చేసేదాణ్ణి.
- ఆధునిక ప్రకాశ్

తల్లి పాలు ఇస్తే.. అందం తగ్గిపోతుంది, రక్తం తగ్గిపోతుంది. శారీరకంగా బలహీనపడుతారు.. వంటి మూఢనమ్మకాలను నమ్మొద్దు అంటూ ప్రచారం సాగిస్తున్నది. గ్రూప్ పెట్టిన ఒక సంవత్సరం తర్వాత మధుసింగ్ పాండా అనే మల్టీ నేషనల్ మహిళను గ్రూప్ అడ్మిన్‌గా నియమించింది. ఐర్లాండ్‌లోని కోర్క్‌లో ఒక టీమ్ తయారుచేసుకున్నది. ఆ తర్వాత టీమ్ మెంబర్స్‌తో పాటు గ్రూప్‌లో సభ్యుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం టీమ్‌లో 40 మంది కౌన్సెలర్లు ఉన్నారు. గ్రూపులోని 80వేల మంది సభ్యులకు 24 గంటలు ఏ సందేహం వచ్చినా నివృత్తి చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత పిల్లల ఆహార నిపుణులు రెండు సంవత్సరాల వయసు వరకు పిల్లలకు తల్లిపాలు ఇవ్వాల్సిందే అని తమ నివేదికలో పొందుపరిచారు. ఈ విషయాలు ప్రజలకు తెలియజేసేందుకు, భారతదేశంలోని పలు నగరాల్లో సమావేశాలు, సెమినార్లు నిర్వహిస్తున్నది. వలంటీర్లకు శిక్షణ ఇచ్చి బ్రెస్ట్ ఫీడింగ్ పట్ల అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నది. సోషల్‌మీడియా ద్వారా బ్రెస్ట్ ఫీడిండ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఈ అవార్డు ద్వారా వచ్చిన ఫండ్ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ పట్ల అవగాహన పెంచే కార్యక్రమాలకే వినియోగించనున్నారు. రొమ్మును సెక్సువల్ అప్పీల్‌గా కాకుండా.. బిడ్డ బలంగా ఎదగడానికి తోడ్పడే అమృతధారగా చూడాలంటూ ప్రచారం నిర్వహిస్తానంటున్నది ఆధునిక ప్రకాశ్.

674
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles