భవితను మార్చిన బిస్మీ


Mon,October 15, 2018 01:27 AM

ఆ గ్రామీణ మహిళలకు ఇప్పుడు స్మార్ట్ మొబైల్ వాడడం తెలుసు. ఫోన్ నుంచే డబ్బులు పంపించడమూ తెలుసు. దీనికంతటికి కారణం బిస్మీ.
image
బిస్మీ.. ఇదో స్వయం సహాయక బృందం. దాదాపు 5 వేలకు పైగా గ్రామాల్లోని ఎన్నో స్వయం సహాయక బృందాలకు శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్, టీవీఎస్ మోటార్ కంపెనీ, సుందరన్ క్లేటోన్ వంటి సంస్థలు ఆర్థిక చేయూతనిస్తున్నాయి. పేద మహిళల ఆర్థికాభివృద్ధి కోసం చేపడుతున్న ఎన్నో కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉంటూ మహిళలకు ఆర్థిక భరోసా ఇస్తున్నాయి. వీరి చేయూత ద్వారా తమిళనాడులోని బిస్మీ బృందం ఎన్నో ఆదాయ మార్గాలను వెతుకున్నది. రుణాలు తీసుకున్న మహిళలు స్వయం ఉపాధికి చేతివృత్తులు, వ్యాపారాలు, టైలరింగ్ చేసుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఒక్క తమిళనాడులోనే కాకుండా మహరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ర్టాల్లో ఎస్‌ఎస్‌టీ తన సేవలను అందిస్తున్నది. ఈ సంస్థల నెలకు దాదాపు 15 నుంచి 20వేల రూపాయలను ఆర్జిస్తున్నారు. స్వయం సహాయక బృందాల మహిళలకు లావాదేవీలు, బ్యాంకు వ్యవహారాలు, మొబైల్ వాడకం, మొబైల్ లావాదేవీలపై అవగాహన కల్పిస్తున్నది ఎస్‌ఎస్‌టీ. దీని ద్వారా పేద విద్యార్థుల చదువులకు కూడా సహాయం అందుతున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు కట్టిస్తున్నారు. పలు రైతు సంఘాలకు కూడా ఆర్థికంగా తోడుంటుంది ఎస్‌ఎస్‌టీ సంస్థ. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళ ఆర్థిక స్వావలంబన కోసం నిరంతరం కృషి చేస్తున్నారు.

457
Tags

More News

VIRAL NEWS