కేరాఫ్ కోల్‌కతా


Wed,September 12, 2018 01:25 AM

ఇదేంటి, కేరాఫ్ కంచరపాలెం సినిమా టైటిల్ కాస్త కేరాఫ్ కోల్‌కతా అని మార్చేశారు అనుకుంటున్నారా? అవును. 4జీ ఇంటర్నెట్ సర్వీస్ బాగున్న నగరంగా కోల్‌కతా ప్రపంచదేశాలను ఓడించి ముందు వరసకు వచ్చి చేరింది. కారణం యువత. అదెలా?
kolkata
ఎక్కడైతే యువత ఎక్కువ ఉంటుందో అక్కడే ఇంటర్నెట్ వాడబడుతుంది. ఇది ఎన్నో సర్వేల్లో వెల్లడయిన విషయం. దినదినాభివృద్ధితో పాటు యువత ఇంటర్నెట్ వాడకాన్ని కూడా అమాంతం పెంచుతున్నారు. దీంతో పాటు టెలికాం సంస్థలిస్తున్న భారీ ఆఫర్లతో నెట్ వాడకం గ్రామీణ ప్రాంతాలకు కూడా వేగంగా విస్తరించింది. 2జీ, 3జీ, 4జీలు దాటి 5జీ వస్తున్న ఈ తరుణంలో ప్రస్తుత 4జీ వాడకంలో ప్రపంచదేశాలతో పోలిస్తే మన దేశంలో ఉన్న నగరం కోల్‌కతా ఆ స్థానంలో నిలువడం శుభపరిణామం. తాజాగా భారతదేశంలో 4జీ సర్వీసులు ఎక్కువగా వాడుతున్న నగరంగా కోల్‌కతా నిలిచింది. దేశంలోని 22 టెలికాం సంస్థలు, ఓపెన్ సిగ్నల్ ద్వారా యూకే మొబైల్ అనాలసిస్ సంస్థలు సంయుక్తంగా జరిగిన సర్వేల ద్వారా తేలింది. 2018 మే నుంచి జూలై మధ్య కాలంలో 4జీ సర్వీస్‌ల వాడకం 90.7 శాతానికి వచ్చింది. అంతకు ముందు 86.6 శాతంతో ఉన్న సింగపూర్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానానికి వచ్చింది కోల్‌కతా.

639
Tags

More News

VIRAL NEWS