నిశ్చల జీవనశైలి వద్దు!


Tue,October 2, 2018 01:50 AM

ఒకేచోట నిశ్చలంగా ఉంటూ పని చేయడం, ఇంట్లోకదలకుండా కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని మనకు తెలిసిందే. అయితే దానివల్ల ఒక్కటి కాదు సమస్యలు ఒక్కొక్కటిగా ముప్పేటా దాడి చేస్తాయంటున్నారు నిపుణులు.
Sedentary-Lifestyle
ఈ రోజుల్లో వచ్చేవన్నీ జీవనశైలి రోగాలే తప్ప జన్యు సంబంధ రోగాలు అంతగా లేవని చెప్తున్నారు ఉత్తరప్రదేశ్ డయాబెటీస్ అసోసియేషన్ 17వ కాన్ఫరెన్స్ ప్రతినిధులు. 2018 సంవత్సరానికి సంబంధించిన సదస్సు నోయిడాలో జరిగింది. దీనికి నేషనల్ క్యాపిటల్ రీజియన్ నుంచి దాదాపు 500 మంది వైద్యలు హాజరయ్యారు. నిశ్చల జీవనశైలి వల్ల ఇంతదవరకు ఒబెసిటీ మాత్రమే వచ్చేదని అంటుండేవారు. కానీ ఇప్పుడు మధుమేహం, ఒబెసిటీ, ఒత్తిడి, కాలేయ సంబంధిత వ్యాధులు వస్తున్నాయని అన్నారు. అంతేకాదు నిశ్చల జీవనశైలి వల్ల ఏర్పడే సమస్యల వల్ల ఇండియా వ్యాధిగ్రస్త సమాజానికి రాజధానిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుందన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 20-70 సంవత్సరాల వయసున్న వారిలో 8.7% మధుమేహ వ్యాధి ప్రభావానికి గురవుతున్నారు. కాబట్టి నిశ్చల జీవనశైలికి స్వస్తి పలకాలని సూచించారు.

283
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles