మెరిసే చర్మానికి!


Sun,October 28, 2018 11:19 PM

ముఖం నల్లమచ్చలు, పొడిబారడం వంటి సమస్యలతో ఎక్కువగా సతమతమవుతుంటారు. ఈ చిట్కాలు పాటిస్తే అన్ని సమస్యలు తొలిగిపోతాయి.
skincare
-పొప్పడి గుజ్జులో కొంచెం నిమ్మరసం కలుపాలి. ఈ మిశ్రమాన్ని మెడ, ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడుగాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే చర్మం మీద ఉండే మురికి తొలిగి కాంతివంతంగా మారుతుంది.
-గ్రీన్ టీ బ్యాగ్‌లోని పొడిని బయటకు తీయాలి. పొడికి కొంచెం తేనె కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ఐప్లె చేయాలి. 10 నిమిషాల తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే చర్మం మెరిసిపోతుంది.
-బాదంపప్పుని నీటిలో నానబెట్టి పేస్ట్‌లా చేయాలి. దీనికి కొంచెం తేనె కలుపాలి. ఈ పేస్ట్‌ని మెడ, ముఖానికి రాయాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే మొటిమలు తొలిగి ముఖం అందంగా, మృదువుగా మారుతుంది.
-అలోవెరా గుజ్జు, గ్రీన్ టీ రెండింటినీ బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 20 నిమిషాల తరువాత నీటితో శుభ్రపరుచుకోవాలి. తరుచూ ఇలా చేస్తే చర్మం మీదున్న నల్ల మచ్చలు తొలిగిపోతాయి.

751
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles