జుట్టు లేకుండానే మోడలింగ్


Thu,September 20, 2018 12:56 AM

జుట్టు లేకుండానే మోడలింగ్

మోడలింగ్ చేయడమంటే మామూలు విషయం కాదు. . మహిళల మోడళ్లకైతే కురులే అందం, ఆస్తి. అలాంటి రంగంలో జుట్టు లేకుండా మోడలింగ్ చేసే ఓ కార్యక్రమానికి విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది.
Alopecia
ఫ్యాషన్ ప్రపంచంలో జుట్టు లేకుండా మోడలింగ్ చేయడం సాధ్యమేనా? అంటే.. కచ్చితంగా సాధ్యమే అంటున్నారు కొందరు మోడల్స్. ప్రస్తుతం సోషల్ మీడియాలో #Alopeciaisfashion(అలోపేసియా ఫ్యాషన్) పేరుతో ఓ హ్యాష్‌ట్యాగ్ ఉద్యమం నడుస్తున్నది. జుట్టులేకుండా మోడలింగ్ చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. లండన్‌లో మొదలైన ఈ ఉద్యమానికి ఎంతో ప్రచారం లభిస్తున్నది. మోడళ్లు తమకు నచ్చినట్లుగా ఉండాలని, ఇక నుంచి క్యాట్‌వాక్ చేయాలంటే అందమైన జుట్టు లేకపోయినా ఫర్వాలేదని అంటున్నారు లండన్‌కు చెందిన పలువురు మోడళ్లు. మోడలింగ్ చేయాలంటే పొడవైన జట్టు ఉండాలి, కాళ్లు ఉండాలి, బాడీ ఫిట్‌గా ఉండాలనే దృక్పథాన్ని మార్చేందుకే ఈ ఉద్యమాన్ని ప్రారంభించినట్లు చెబుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే కనుమరుగైన ఎంతోమంది మోడళ్లు.. ధైర్యంగా ముందుకొస్తున్నారు. మోడలింగ్‌లో పాల్గొంటున్నారు.

757
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles