సంపన్న జీవితానికి 9 సూత్రాలు


Sat,September 8, 2018 01:37 AM

సంపన్నులం కావాలని కలల కనడం మనందరి సహజ లక్షణం. సంపదను సృష్టించి ప్రశాంతంగా, సంతోషంగా జీవితాన్ని గడపాలని అనుకోవడం కూడా అంతే సహజం. ఈ సంపదను సృష్టించుకోవడానికి ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఆ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన ప్రణాళిక, క్రమశిక్షణ, సరైన సమాచారం.. ఇలా చాలా అంశాలనుమన దగ్గర ఉండదు. సంపద సృష్టి లేదా సంపదను నిర్వహించడం అనేది చాలా దీర్ఘకాల ప్రక్రియ. కొన్ని నియమాలను పాటిస్తే కాలం గడిచేకొద్దీ సంపద పెరుగుతూ వస్తుంటుంది. మీ ఆర్థిక లక్ష్యాలతో సంబంధం లేకుండా, సంపదను నిర్వహించడానికి పాటించాల్సినకొన్ని నియామాలున్నాయి. అవేంటో చూద్దాం.
Coins

మీ స్తోమత ఎంత?

మీకు మీరు స్పష్టమై ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవడానికి స్తోమత ఏమిటో తెలుసుకోవడమే మొదటి అడుగు. మీ అసలు విలువెంతో తెలిస్తే మీకు ఉన్న అప్పులు, ఆస్తులు తెలుస్తాయి. ఏ సమయంలోనైనా సరే మన ఆర్థిక స్థితిగతుల ముఖచిత్రాన్ని తెలుపుతుంది. మీ స్తోమత ఎంతో తెలిస్తే మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవడం తేలిక. అలాగే స్తోమతను సమీక్షించుకోవడం వల్ల మీ ప్రస్తుత పరిస్థితి ఏమిటో అంచనా వేసుకోగలరు. మీ వ్యక్తగత ఆర్థిక అంశాలకు సంబంధించి మీ లక్ష్యాలను చేరుకునే దారిని చూపుతుంది. ఒకవేళ మీరు సరైన దారిలో వెళ్లక పోతే హెచ్చరికలు కూడా ఇస్తుంది.

ఆదాయం కన్నా తక్కువ వ్యయం

ఇది పాత సలహానే. కాకపోతే పెదల మాట చద్దిమూట. సంపదను సృష్టించుకోవాలంటే మార్కెట్లో మదుపు చేయడానికి మీ దగ్గర మిగులు నిధులు ఉండాలి. వినోద, విలాసాల కోసం నెల సంపాదనంతా ఖర్చు పెట్టొద్దు. మరీ పిసినారిగా ఉండమని చెప్పడం మా ఉద్దేశం కాదు. కానీ, కష్టపడి సంపాదించిన సొమ్మును కాస్త ఆచి తూచి ఖర్చు చేస్తే చాలు. మీ నెలసరి బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఖర్చు చేయడం మొదలుపెడితే మీ వ్యయాలన్నీ దాదాపుగా అదుపులో ఉంటాయి. మీరు సంపన్నులు కావడానికి ఇది రెండో మెట్టు.

తెలివైన మదుపు

మదుపు చేయాలంటే మీ దగ్గర మిగులు నిధులుండాలి. మీ దగ్గర డబ్బుంటే చాలు మదుపు చేయడానికి మార్కెట్‌లో అనేక స్కీములు ఉన్నాయి. అర్థం చేసుకోవడానికి కష్టంగా స్కీముల్లో లేదా అర్థం కాని స్కీముల్లో మీరు కష్టపడి సంపాదించిన సొమ్మును మదుపు చేసి జూదం ఆడకండి. మంచి రాబడులు ఇచ్చిన చరిత్ర ఉన్న స్కీముల్లో పెట్టుబడి పెడితే మీ కాపిటల్ వృద్ధి చెందడంతో పాటు దాని మీద క్రమంగా ఆదాయం వస్తుంది. వ్యవస్థీకృత వెల్త్ మేనేజ్‌మెంట్ ప్రణాళిక కోసం అనుభవం ఉన్న ఫైనాన్షియల్ ప్లానర్‌ను కలిసి సలహా తీసుకోవడం మంచిది.

వివిధీకరించండి

అన్ని గుడ్లను ఒకే బుట్టలో పెట్టొద్దు అనేది పాత సామెత. మీ పెట్టుబడులను కూడా వివిధీకరించండి. ఏ సాధనాల్లో ఎంతెంత అనే దానికి కూడా సూత్రం ఉంది. మీ వయసు, సంపాదన, రిస్క్ తీసుకునే సామర్థ్యం తదితర అంశాల ఆధారంగా వివిధ మదుపు సాధనాల్లో పెట్టుబడి పెట్టండి. ఇలా వివిధీకరించడం వల్ల మనకు మూడు రకాల ప్రయోజనాలు కలుగుతాయి. మొదట వివిధ మదుపు సాధనాల్లో పెట్టబడి పెట్టడం వల్ల రిస్క్ తగ్గిపోతుంది. రెండు, మీ కాపిటల్ భద్రంగా ఉంటుంది. మీ సేవింగ్స్ కూడా భద్రంగా ఉంటాయి. మూడు, ఒకే ఆదాయ మార్గం కాకుండా ఇతర మదుపు మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందే వీలుంటుంది.

ఓపికే వరం

మనం చేసే మదుపు మీద రాబడులు మార్కెట్ రిస్క్‌లు, ఒడిదుడుకుల మీద ఆధారపడి ఉంటాయి. మార్కెట్‌లో వచ్చే స్వల్పకాలిక హెచ్చుతగ్గులను చూసి బెదిరి పోకూడదు. మీరు పద్ధతిగా ఆలోచించి చేసిన మదుపు మీద నమ్మకం ఉంచండి. ఓపిగ్గా ఉండండి. హెచ్చుతగ్గులు తగ్గే వరకు ఓపికపట్టండి. మీ మదుపును పరిపక్వ దశకు వచ్చే వరకూ వేచి ఉండండి. దీర్థకాలంలో మీరు మదుపు చేసిన మొత్తం మీద మంచి రాబడులు వస్తాయి. మార్కెట్ భారీగా ఒడిదుడుకులకు లోనవుతున్నప్పుడు లేదా మీ మదుపు రాబడులపై ఆందోళనగా ఉన్నప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా మీ ఫైనాన్షియల్ ప్లానర్‌ను సంప్రదించండి. ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ అయినా సరే ఒడిదుడుకులు సహజంగా ఉంటాయన్న సహజ సూత్రాన్ని మరవకండి. ఆ ఒడిదుడుకులను ఓపికతోనే ఎదుర్కోండి.

సమీక్ష

ఏ ఇన్వెస్ట్‌మెంట్‌కైనా ఓపికే ముఖ్యం. కానీ, ఇన్వెస్ట్‌మెంట్ల మీద రాబడి సాధారణ స్థాయి కన్నా ఎక్కువగా ఉండాలంటే మాత్రం ఓపిక ఒక్కటే సరిపోదు. మీ ఇన్వెస్ట్‌మెంట్లన్నింటిని పైనా క్రమం తప్పకుండా సమీక్ష జరపుకుంటూ ఉండాలి. దీంతో మీకు ఏ ఇనెస్ట్‌మెంట్ రాబడులను ఇస్తుందో, ఏ ఇన్వెస్ట్‌మెంట్ నష్టాల్లో ఉందో తెలుసుకోవచ్చు. అలా తెలసుకోవడం వల్ల మీ పోర్టుఫోలియోను పునర్‌వ్యవస్థీకరించుకునే అవకాశం ఉంటుంది. దీంతో రాబడులను పెంచుకోవచ్చు.

బీమాతో ధీమా

భవిష్యతో ఏ విపత్తు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. సంపదను సృష్టించుకునే క్రమంలో భాగంగా సరిపోను బీమాను తీసుకోవడం తప్పని సరి. సాధారణంగా పన్నులను తప్పించుకోవడానికో, లేదా ఇన్వెస్ట్‌మెంట్ కోసమనో లేదా రెండింటి కోసం బీమా తీసుకుంటాం. అయితే పన్నును ఆదా చేయడం, ఇన్వెస్ట్‌మెంట్ ను రెండింటినీ కలగలపకండి. సరైన బీమా కవరేజి ఉంటే అత్యవసర పరిస్థితుల్లో మీకు మీ కుటుంబానికి ఆర్థిక సంరక్షణ ఉంటుంది. ఎండోమెంట్, చైల్డ్ పాలసీలను ఎంచుకోండి. దానికి వల్ల మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడం సులువు అవుతుంది. ఆ తర్వాతనే యూనిట్ లింకడ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యులిప్)లను దీర్ఘకాలానికి మాత్రమే తీసుకోండి. లేదా పన్ను ఆదా కోసం ఈక్విటీ లింక్‌డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్‌ఎస్‌ఎస్)లను ఎంచుకోండి. ఇవి మీకు దీర్ఘకాలంలో సంప్రదాయ ఇన్వెస్ట్‌మెంట్ల కన్నా మెరుగైన రాబడులను అందిస్తాయి.

పన్ను ప్రణాళిక

పన్నులను తప్పించుకోవడం సాధ్యం కాదు. కాలానుగుణంగా పన్ను స్లాబులు మారుతుంటాయి. నియమ నిబంధనలూ మారుతుంటాయి. కానీ పన్నులు చెల్లించక తప్పదు. ఆర్థిక ప్రణాళికలోని ప్రతి అంశంలోనూ పన్ను ప్రభావం ఉంటుంది. ఈ పన్నులకు సంబంధించి చాలా చురుకుగా ఉంటూ వాటిని ఆదా చేసుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు చివరి తేదీ దాకా ఉండకండి. ముం దుగానే మీ పన్ను ప్రణాళికలను సిద్ధం చేసుకోండి. టా క్స్ ప్లానర్‌ను సంప్రదించండి. పన్ను ఆదా అయ్యే మ దుపు లేదా పొదుపు సాధనాల్లో పెట్టుబడి పెట్టండి. ఆదాయపన్ను చట్టం ప్రకారం మినహాయింపులు రాగల వివి ధ సెక్షన్లను క్షుణ్ణంగా అర్థం చేసుకుని అందుకనుగుణం గా మదుపు చేయండి. పన్ను ప్రణాళికతో తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడంతో పాటు మీ సంపాదనను ఆదా చేసుకోవడానికీ ఉపయోగపడుతుంది.

రిటైర్‌మెంట్ ప్రణాళిక

వెల్త్ మేనేజ్‌మెంట్ ప్రణాళికలో రిటైర్‌మెంట్ ప్రణాళిక ఒక ముఖ్యమైన భాగం. మీరు ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా మీకు నెలసరి ఆదాయం వచ్చే విధంగా మీ రిటైర్‌మెంట్ ప్రణాళిక ఉండాలి. ఇందులో కూడా మీరు పన్నులను ఆదా చేయవచ్చు. అన్నింటి కన్నా ముఖ్యంగా రిటైర్ ప్రణాళికతో ప్రశాతం జీవనాన్ని గడపవచ్చు.
money-and-pens

866
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles