గర్విత.. కీర్తిపతాక


Wed,September 12, 2018 01:26 AM

ప్రపంచవ్యాప్తంగా 42 దేశాలు.. 18-23 సంవత్సరాల మధ్య వెయ్యిమంది యంగ్ లీడర్స్. అందులో అరవై మంది గ్లోబల్ చేంజ్‌మేకర్స్. వారిలో ఒక్క భారతీయ యువతి. గర్విత.. దేశం గర్వించ దగ్గ పనిచేసింది.
Garvita
బెంగళూరుకు చెందిన గర్విత గులాటి, పూజ తనవాడే స్కూల్లో చదువుతున్నప్పుడు ఓ స్వచ్ఛంద సంస్థ అక్కడికి వచ్చి నీళ్ల గురించి అవగాహన కల్పించారు. అప్పటి నుంచి నీటిని తక్కువగా వాడటం ప్రారంభించింది. బెంగళూరులో ఉన్న రెస్టారెంట్స్‌కి వెళ్లి యజమానులతో మాట్లాడి నీటి వినియోగం మీద చర్చించింది. అనవసరంగా నీళ్లు వృథా చేయొద్దని వాళ్లకి చెప్పడం మొదలుపెట్టింది. సంవత్సరానికి 14 మిలియన్ లీటర్ల నీళ్లు వృథా చేస్తున్నామని, ఇకనుంచైనా రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు గ్లాస్‌లో సగం తాగి మిగిలియ్య కూడదని, ఒకవేళ తాగాలనుకుంటే ఎంత కావాలో అంతే మోతాదులో వేసుకోవాలని సూచిస్తున్నది. రెండేళ్ల పాటు రెస్టారెంట్లు తిరిగి నీళ్ల వాడకం చూసి బాధపడింది. వై వేస్ట్? పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2015 జూలైలో ప్రారంభమైన ఈ చాలెంజ్‌కు అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రశంసలు రావడం మొదలయింది. చేంజ్ ఓఆర్‌జీ సంస్థ నిర్వహించిన గ్లోబల్ చేంజ్ మేకర్స్ కార్యక్రమానికి ఎంపికైన అతిపిన్న వయస్కురాలిగా గర్విత రికార్డు నమోదు చేసింది. ఇందుకు సంబంధించిన కార్యక్రమం ఆగస్టు 12నుంచి 18 వరకు స్విట్జర్‌లాండ్‌లోని జురిచ్‌లో జరిగింది. ఈ అవకాశం తనకు రావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేయడంతో పాటు మరిన్ని కార్యక్రమాలు రూపొందించే ధైర్యాన్నిచ్చిందని చెప్తుంది. గర్విత ప్రారంభించిన కార్యక్రమానికి పెద్ద సంస్థలు, పెద్ద వ్యక్తులు పాలుపంచుకుంటున్నాయి. ఈ మూడేళ్లలో వందల మంది వలంటీర్లు వచ్చారు. ప్రణాళిక ప్రకారం రెస్టారెంట్లు, నీటి వినియోగం ఎక్కువ ఉన్న చోట్లకి వెళ్లి ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తున్నారు.

920
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles