పదివేల అడుగులేయండి!


Tue,October 2, 2018 01:47 AM

వాకింగ్ విషయంలో చాలామందికి చాలా సందేహాలుంటాయి. కొందరు పేరుకు నాలుగు అడుగులేసి ఎక్సర్‌సైజ్ చేశామనే అనుభూతి పొందితే.. మరికొందరు గంటల తరబడీ నడుస్తారు. ఇంతకీ ఎంతసేపు నడవాలి? ఎంతదూరం నడవాలి? అనే క్లారిటీ ఉంటే చక్కటి ఫలితాన్ని పొందవచ్చు.
10000-Steps
జపాన్‌కు చెందిన క్యుషూ యూనివర్సిటీ ఆఫ్ వెల్త్ అండ్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో తాజాగా ఓ అధ్యయనం చేపట్టారు. పొద్దున్నే వాకింగ్ చేయడం వీలు కాకపోతే ఏదో ఒక సందర్భంలో వాకింగ్ చేసినా సరిపోతుందని సూచించారు. అధ్యయనంలో భాగంగా వారు 45-50 ఏండ్ల వయసున్న వారి వ్యాయామ తీరును పరిశీలించారు. వారిలో రోజుకు 3500-5000 అడుగులు వేసేవాళ్లే ఎక్కువగా ఉన్నారట. యువకులైతే 8000-12000 అడుగులు వేస్తారట. వయసురీత్యానో, పనిరీత్యానో కిలోమీటర్లు, గంటలకొద్ది వ్యాయామం చేసే తీరికలేనివాళ్ల కోసం పరిశోధకులు ఒక సలహా ఇచ్చారు. రోజుకు తప్పనిసరిగా 10000 అడుగులు వేస్తే అదే ఆరోగ్యరక్షగా మారుతుందని, ముఖ్యంగా కరోనరీ వ్యాధులు, మధుమేహం టైప్-2 వంటి వ్యాధులు నయమవుతాయని చెప్పారు.

325
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles