మార్పు తీసుకొచ్చేది మహిళే!


Sat,May 12, 2018 12:34 AM

మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరు అని నిరూపించేందుకు బెంగళూర్‌లో ఓ సంస్థ ఏర్పడింది. వీరి లక్ష్యం ఒక్కటే సమాజంలో సమస్యలపై పోరాడి మార్పును తీసుకురావడం.
She-Creates-Change
బెంగళూర్‌కు చెందిన చేంజ్‌డాట్ ఆర్గ్ అనే స్వచ్ఛంద సంస్థ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాడుతున్నది. ఇందుకు షీ క్రియేట్స్ చేంజ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ సంస్థ ద్వారా మహిళలకు సమస్యలపై ఎలా పోరాడాలనే అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఇందుకు ప్రత్యేకంగా వర్క్‌షాపులు నిర్వహిస్తున్నది. ఇందులో ఆయా వర్గాలకు చెందిన నిపుణులైన మహిళలు క్లాసులు చెబుతారు. ఒక సమస్యపై ఎలా పోరాడాలి? అందుకు ఎవరిని సంప్రదించాలి? పోరాట పంథా ఎలా ఉండాలి? అది పరిష్కారమయ్యేంత వరకూ దానిపైనే ఎలా స్పందించాలి? వంటి విషయాలు బోధిస్తారు. వర్క్‌షాప్‌లో ఎంపికైన మహిళలు ఒక ఏడాదంతా ఆ సమస్యపైనే పోరాటం చేయాలి. ఈ సమయంలో దాన్ని పూర్తిగా పరిష్కరించాలి. ఇలా లక్ష్యాలను ఎంచుకొని సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఇలా ఎన్నో సమస్యలను పరిష్కరించుకున్నారు కూడా. ఈ సంస్థ సభ్యులు చేసే పోరాటానికి మహిళా కేంద్రమంత్రులు కూడా మద్దతిస్తున్నారు. మార్పు మన నుంచే మొదలవ్వాలని చేంజ్ డాట్ ఆర్గ్ సభ్యులు చేస్తున్న కృషిని పలువురు కొనియాడుతున్నారు.

290
Tags

More News

VIRAL NEWS

Featured Articles