పుస్తకం అవసరం లేని పాఠశాలలు!


Sat,August 25, 2018 11:05 PM

స్కూల్ అంటేనే బ్యాగ్ ఉండాలి.. బ్యాగ్ నిండా మోయలేనన్ని స్తకాలుండాలి.పుస్తకాలు లేకుంటే కొడుతారు.. ఉంటే చదువమని వేధిస్తారు.చదివితే పరీక్షలు రాయాలి.. మార్కులు తక్కువ వస్తే మళ్లీ తన్నులే.ఇదేనా స్కూల్ అంటే..? ఒక ఆటా పాటా అంటూ ఉండదా!!?చదువంటే నాలుగు గోడల మధ్యనే చెప్పాలా? లేకుంటే చెప్పలేరా? అలా చెబితే అర్థం కాదా?ఎందుకు అర్థం కాదు..! అసలు పుస్తకమే అవసరం లేని స్కూళ్లు ఉన్నాయి. పరీక్షలే పెట్టని పాఠశాలలున్నాయి! అవే.. రేపటి తరాన్ని స్వేచ్ఛా చదువుల వైపు నడిపిస్తున్నాయి!

veena-vadini-school

వీణవదిని స్కూల్!

వీణవదిని స్కూల్ మధ్యప్రదేశ్‌లోని సింగ్రాలిలో ఉంది. దీనిలో మొత్తం 300కి పైగా విద్యార్థులు ఉన్నారు. వీరిలో వందమందికి పైగా రెండు చేతులతో ఒకేసారి రాయడం విశేషం. పిల్లలకు మొదటి తరగతి నుంచే శిక్షణ ఇస్తారు. మూడవ తరగతికి వచ్చే సరికి రెండు చేతులతో రాయడం అలవాటవుతుంది. విద్యార్థులకు రోమన్, అరబిక్‌లతో కలిపి మొత్తం ఆరు భాషలలో విద్యను బోధిస్తారు. ఎనిమిదవ తరగతికి వచ్చేసరికి రెండు రకాల స్క్రిప్ట్‌లను రాయగలుగుతారు. మూడు గంటలు రాసే పరీక్షను 90 నిమిషాలకే పూర్తి చేస్తారు.

smart-school

స్మార్ట్ స్కూల్!

పేరుకు తగ్గట్టే ఈ స్కూల్ ఉంటుంది. ఎక్కువమంది పిల్లలు సినిమాలు చూడ్డానికి స్కూల్ బంక్ కొడుతుంటారు. అది గమనించిన అక్కడి ఉపాధాయుడు సందీప్ స్కూల్‌లో కంప్యూటర్‌ను పెట్టించాడు. పాఠాలను సినిమాల్లా చూపించి పిల్లలందరినీ ఆకట్టుకున్నాడు. 500కి పైగా పాఠశాలలు ఉన్న మహారాష్ట్రలో స్మార్ట్ స్కూల్‌ది ప్రత్యేక స్థానం. పరీక్షలకు తగ్గట్టుగా సిలబస్‌ను పూర్తి చేస్తారు. చూసిన సినిమా పాఠాలు పరీక్షలో వస్తే ప్రతీ లైన్ మర్చిపోకుండా రాస్తున్నారు పిల్లలు. అవి ఆసక్తికరంగా ఉండేసరికి పిల్లలు స్కూల్ డుమ్మా కొట్టకుండా వస్తున్నారు.

yellow-train-school

యెల్లోట్రైన్ స్కూల్!

ఇది తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పిల్లలు అందరూ సమానమే. ఒకరు ఫస్ట్, సెకండ్ అనే భేదం లేదు. చదువుచెప్పే టీచర్లు తమ హోదాని ప్రదర్శించకుండా పిల్లలతో కలిసిపోతారు. అప్పుడే పిల్లలు కూడా ఉపాధ్యాయుల దగ్గర మర్యాదగా మెలుగుతారు. చదువును థియరిటికల్‌గా చెప్పకుండా ప్రాక్టికల్‌గా చూపి వాటి మీద అవగాహనను కల్పిస్తారు. ఎలాంటి ఒత్తిడికి గురవ్వరు కాబట్టి అక్కడ సంఖ్య కూడా ఎక్కువగా ఉండడం ఈ స్కూల్ ప్రత్యేకత. గదిలోనే చదువు చెప్పకుండా సిలబస్‌కు తగ్గట్టుగా ప్రదేశాలను మారుస్తుంటారు.

ananya-school

అనన్య స్కూల్!

బెంగళూర్‌లో స్థాపించిన అనన్య స్కూల్‌లో పుస్తకాలుండవు. అలాగే ఎలాంటి పరీక్షలు కూడా పెట్టరు. ఇంతకీ చదువు చెప్తారా? అని అనుకుంటున్నారా? ఆ సందేహం మనసులోకి కూడా రానివ్వొద్దు. ఎందుకంటే పుస్తకాలు తెచ్చుకొని పాఠాలు చెప్పేది ఉపాధ్యాయులే. పిల్లలకు అంత శ్రమ కల్పించరు. చాలామంది పిల్లలు కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా చదువు మధ్యలోనే మానేస్తుంటారు. అలా మధ్యలో మానేసి, చదువుకోవాలని ఆశగా ఉన్నవారికే ఈ పాఠశాలలో చదువు చెబుతారు. అలాంటి వారిని చేరదీసి చదువు చెప్పిస్తున్నారు డాక్టర్ శశిరావు. ఆయన ఇంట్లోనే ఒక స్కూల్‌ను ఏర్పాటు చేసి, దానికి అనన్య స్కూల్ అని పేరు పెట్టారు. చదువంటే ఆసక్తి ఉన్నవారందరూ ప్రతిరోజూ రావు ఇంట్లో కలుసుకొనేవారు. పొద్దుగాలే ఆటలతో ఈ స్కూల్ మొదలవుతుంది. తర్వాత గణితం, భూగోళ శాస్త్రం విషయాలను చర్చిస్తారు. అంతేకాదు, వ్యాయామం, పెయింటింగ్స్, వంటలు, మంచి ప్రవర్తనతో మెలగడం వంటివి నేర్పిస్తారు. ఇక్కడ ఎక్కువగా నిరుపేదల పిల్లలు విద్యనభ్యసిస్తున్నారు. ఇలా పుస్తకాలకు దూరంగా ఉంచి, ప్రతి విషయంపై చర్చించి, లోతుగా అర్థమయ్యేలా కొత్త బోధనా పద్ధతిని అమలు చేస్తున్నారు.

Platform-school

ఫ్లాట్‌ఫామ్ స్కూల్!

బీహార్‌లోని పాట్నాలో ఇంద్రజిత్ ఖురానా అనే మహిళ ఫ్లాట్‌ఫామ్ మీద స్కూల్ నడుపుతున్నది. ఆమెని చూసి మరికొంతమంది పాఠాలు చెప్పడానికి వచ్చారు. అక్కడ టీ అమ్ముకొనే పిల్లలకు ఉచితంగా చదువు చెబుతున్నది. జీవిత నైపుణ్యాలు, వైద్య చికిత్సకు సంబంధించిన విషయాలు ఇక్కడ చెబుతారు. నాలుగు గోడల మధ్య కన్నా.. ఇలా ప్రపంచాన్ని చూపిస్తూ చదువు చెబితే పిల్లలు శ్రద్ధగా వింటున్నారని, వారి భవిష్యత్ కోసం యథార్థ సంఘటనలు ఉదహరిస్తామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

loktat-lake-school

లోక్తాక్ లేక్ స్కూల్!

ఇది మణిపూర్ రాష్ట్రంలో ఉన్నది. లోక్తాక్ సరస్సుపైనే స్థానిక ప్రజలందరూ ఆధారపడి బతుకుతుంటారు. వీరి జీవనాధారం కోసం ఈ సరస్సులోనే చేపలు పడుతుంటారు. పెద్దలు చదువుకోకపోవడంతో.. తమ పిల్లలను బాగా చదివించాలని ఈ సరస్సు పక్కనే పాఠశాలను నిర్మించారు. ఇక్కడ ప్రశాంత వాతావరణంలో చదువు సాగుతుంటుంది. పిల్లలు కూడా ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు శ్రద్ధగా వింటూ.. ఉన్నతంగా ఎదుగుతున్నారు.

900
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles