ఉద్యమాల కాగడా స్వాతి మలివాల్!


Tue,August 28, 2018 11:11 PM

12 యేండ్ల లోపు బాలికలను రేప్ చేస్తే.. కఠిన కారాగార శిక్ష, తీవ్రతను బట్టి మరణశిక్ష విధించాలని కొద్ది నెలల క్రితం ఆర్డినెన్స్ జారీ అయింది. దీనిని జారీ చేయడానికి ఎంతోమంది పోరు సాగించారు. వారిలో ఢిల్లీ కేంద్రంగా పదిరోజుల పాటు దీక్ష చేపట్టి, కేంద్ర ప్రభుత్వంలో కదిలికను తీసుకొచ్చింది స్వాతి మలివాల్.
Swati-Maliwal
దేశంలో నానాటికీ పెరిగిపోతున్న లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌తో ఎంతోకొంత ఊరట లభించింది. మృగాళ్లకు ముకుతాడు వేసేందుకు ఈ ఆర్డినెన్స్‌ను తెప్పించడం వెనుక ఎంతోమంది పోరాటం ఉన్నది. వీరిలో ఢిల్లీలో దీక్ష చేపట్టిన స్వాతి మలివాల్ ఒకరు. ఢిల్లీ కమిషన్ ఆఫ్ ఉమెన్(డీసీడబ్ల్యూ) చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న స్వాతి.. ఎన్నో ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నది. దేశంలో పెరిగిపోతున్న లైంగిక దాడులను ఆరికట్టాలంటూ నేటికీ ఉద్యమాలు చేస్తూనే ఉన్నది. గతంలో ఎనిమిది నెలల శిశువును దవాఖానలో రేప్ చేసిన సంఘటన, కథువా ఘటనలను సీరియస్‌గా తీసుకున్న స్వాతి.. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఉద్యమాలు చేపట్టింది. దేశం మొత్తం ఈ దారుణాలపై గళమెత్తడంతో.. కేంద్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.


ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలో కూడా ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నది స్వాతి. దేశరాజధానిలో మహిళల రక్షణ కోసం 66వేలకు పైగా పోలీసులను నియమించాలని పోరాడింది. బాలలు, యువతుల అక్రమ రవాణా, పనివద్ద లైంగిక వేధింపులు వంటి వాటిని ఆరికట్టేందుకు చర్యలు తీసుకొనేలా ప్రభుత్వంతో చర్చలు జరిపింది. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా మహిళలకు సంబంధించిన ఎన్నో సమస్యలను పరిష్కరించింది. బాధితులకు న్యాయం చేసేందుకు శనివారం, ఆదివారం కూడా అనధికారింగా విధులు నిర్వర్తిస్తున్నది స్వాతి మలివాల్.

608
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles