ట్రెండు మారునా?


Tue,October 2, 2018 11:02 PM

sonali
ఏ ట్రెండ్ మారినా.. మన ట్రెండు మారకూడదు. ఫ్రెండ్ మారినా మన ట్రెండ్ మార్చకూడదు. అప్పుడే కదా మనకంటూ గుర్తింపు ఉండేది. బాలీవుడ్ భామలు కూడా అదే చేశారు. ట్రెండ్ మారినా కొత్త ట్రెండ్‌తో చీరలు చుట్టుకున్నారు. ఫ్యాషన్ షోలు అంటేనే తారలు, తళకులు. పొట్టి గౌనులు, పొడుగు గాగ్రాలు.. అలాంటి ట్రెండ్ నుంచి ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది. ఇటీవల జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో బాలీవుడ్ తారలంతా చేనేత వస్ర్తాల్లో మెరిసారు. పట్టు, కాంజీవరం చీరలు కట్టుకొని హోయలు పోయారు. సుస్మితా సేన్, విద్యాబాలన్ మొదలుకొని సోనాలి బింద్రే, లిసారే, కృతి కర్బందా ఇలా అందాల భామలు చీరలు చుట్టి సంప్రదాయబద్ధంగా ర్యాంప్ వాక్‌లు చేశారు.

765
Tags

More News

VIRAL NEWS

Featured Articles