జిహ్వకో బుద్ధి..


Mon,August 14, 2017 01:34 AM

పెంపుడు జంతువులు అంటే ఎవ్వరికి ఇష్టం ఉండదు చెప్పండి. మధ్య తరగతి నుంచి హైక్లాస్ వరకూ వారి స్థోమతకు తగ్గట్లుగా ఏదో జంతువును సాదుకుంటుంటారు. కానీ ఈ లండన్ భామ మాత్రం.. చాలా వెరైటీ గురూ.. ఎలాగంటారా..?
Snake-Sundari
పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అనే దానికి ఈ అమ్మాయి ఓ చక్కని ఉదాహరణ. ఎందుకంటే అందరూ ఏ కుక్కనో, పిల్లినో, పక్షినో పెంచుకుంటే లండన్‌కు చెందిన ఎంజోటిక్ మాత్రం విషపూరితమైన పాములు, కొండచిలువలు, బొద్దింకలు, నత్తలు, ఫెర్రెట్లు, సాలీడులను పెంచుకుంటున్నది. అవి కూడా ఇతర దేశాలకు చెందినవి. వాటితోనే గడుపుతూ.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నది. అవి కాస్తా వైరల్ కావడంతో ఎంజోటిక్ పాపులర్ అయ్యింది. వీటి గురించి చుట్టుపక్కల పిల్లలకు వివరిస్తూ.. వాటిని ఎలా పెంచాలో అవగాహన కల్పిస్తున్నది. రెబల్ సర్కస్ పేరుతో వాటి వీడియోలు, ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో అప్‌లోడ్ చేస్తున్నది. చాలామంది ఇంత లేతవయసులో ఇదేం పోయేకాలం అంటుంటే.. జీవజాలం అధ్యయనానికి, అవగాహనకు ఎంజోటిక్ మంచి ప్రయత్నం చేస్తున్నదని మరికొందరు కొనియాడుతున్నారు.

429
Tags

More News

VIRAL NEWS