అంధులకు విద్యా వెలుగు!


Fri,August 17, 2018 01:32 AM

కంటిచూపు ఉంటేనే ఈ ప్రపంచాన్ని చూడగలుగుతాం. పుట్టుకతోనే చూపు కోల్పోయిన వారి పరిస్థితి ఏంటి? వాళ్లు ఎలా చదువుకోవాలి? ఎలా ఉన్నతంగా ఎదగాలి? అని ఆలోచించిన యువత అశ్వినీ అంగడి. అంధ విద్యార్థుల కోసం ఒక రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించి వారి కంటికి వెలుగైంది!
Ashwini-Angadi
అశ్వినీది కర్ణాటకలోని బళ్లారి పరిధిలో ఉన్న చిన్న పల్లెటూరు. ఆమె పుట్టుకతోనే అంధురాలు. పేదరికం కారణంగా వారి తల్లిదండ్రులది ఏమీ చేయలేని పరిస్థితి. కనీసం డాక్టర్‌ను సంప్రదించి కారణం తెలుసుకోలేని దుస్థితి వాళ్లది. బాగా ఆలోచించి శ్రీరమణ మహారుషి ైబ్లెండ్ అకాడమీలో చేర్పించారు. అక్కడే పదో తరగతి వరకు చదువుకున్న అశ్వినీ ఎన్‌ఎంకేఆర్‌వీ కాలేజీలో చేరి ఎన్నో విషయాల పట్ల అవగాహన ఏర్పరచుకున్నది. ఎన్విరాన్‌మెంట్.. బాలిక విద్య గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అందర్నీ ఆకర్షించింది. అంధ విద్యార్థిగా తాను చేసిన కృషి అంతర్జాతీయ స్థాయిలో ఆలోచింపజేసింది. కర్ణాటక రాష్ర్టానికి యునైటెడ్ నేషన్స్ నుంచి గ్లోబల్ అంబాసిడర్‌గా ఎంపికైంది. అంధత్వంతో ఎవరూ బాధపడకూడదనీ.. అలాంటి వారందరికీ తాను అండగా ఉంటానని బెంగళూరులోని మగడిరోడ్డు సమీపంలో బేలకు అకాడమీ స్థాపించింది. పది మంది విద్యార్థులతో ప్రారంభించిన ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో ఇప్పుడు 35మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి భోజనం, వసతి, విద్యోపకరణాలకు సంబంధించిన అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నది. బ్రెయిలీ లిపిలో విద్యా బోధన అందిస్తున్నది. డిజిటల్ పాఠాలు బోధిస్తూ బేలకు అకాడమీని కళాశాలగా మార్చాలనే దిశగా అడుగులేస్తున్నది.

296
Tags

More News

VIRAL NEWS