గింజలతో ఆరోగ్యం


Mon,July 31, 2017 01:30 AM

ginjalu
దానిమ్మ గింజల్లో కొవ్వును కరిగించే విటమిన్ సి ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి తరుచూ ఈ గింజలు తినాలి. అధిక కేలరీలను తగ్గిస్తాయి.
మోకాళ్లు, కీళ్లు, ఎముకల్లో కీళ్లు అరిగిపోవడం వల్ల ఏర్పడే నొప్పులకు చింతగింజలు మంచి ఔషధం. ఈ గింజల్ని వేయించి పొడిగా చేసుకుని రెండు పూటలా పాలలో లేదా నీటిలో కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

సజ్జ గింజల్లో బోలెడన్ని ఔషధ గుణాలున్నాయి. శరీర ఉష్ణోగ్రతలు తగ్గించడంలో బాగా పనిచేస్తాయి. చికెన్ పాక్స్ వచ్చినప్పుడు నీటిలో నానబెట్టి సజ్జ గింజల్ని కొబ్బరినీళ్లతో కలిపి తీసుకుంటే చర్మంపై మంటలు తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునే మహిళలు సజ్జ గింజలు నానబెట్టిన నీటిని తాగితే మంచిది.

వేరుశనగల్లో ఒలియెక్ కొవ్వు ఉంటుంది. మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు కూడా ఎక్కువే. అందువల్ల వీటిని తరుచూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది.
అవిసె గింజలు అత్యుత్తమ ఆహారపదార్థాల్లో భాగంగా చెబుతారు. క్యాన్సర్, మధుమేహం, గుండెనొప్పి వంటి వ్యాధులను దరి చేరుకుండా చేస్తాయి. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి.

912
Tags

More News

VIRAL NEWS