అల్ట్రా మారథాన్ ఆణిమూత్యం!


Thu,September 20, 2018 12:56 AM

వయసు 36 యేండ్లు, ఓ బిడ్డకు తల్లి. అయినా పరుగు పందేలంటే ఎప్పుడూ ముందే ఉంటుంది. అది కూడా తనకు ఇష్టమైన అల్టా మారథాన్ అయితే తప్పకుండా పాల్గొంటుంది. ఇటీవల నిర్వహించిన ఖర్దంగ్ లా చాలెంజ్‌లో రెండో స్థానం సంపాదించి ప్రపంచ ఆల్ట్రా మారథాన్ రన్నర్స్ సరసన నిలిచింది.
Ultra-MarathonRunner
షిల్లాంగ్‌కు చెందిన ఈమె పేరు రెఫికా బెక్కీ డే. ఈ నెలలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ఖర్దంగ్ లా చాలెంజ్‌లో రెండో స్థానంలో నిలిచిందీమె. ఈ మారథాన్ దాదాపు 72 కిలోమీటర్లు ఉంటుంది. ఎత్తైన కొండల్లో సాగే ఈ ప్రమాదకర మారథాన్‌లో ప్రపంచవ్యాప్తంగా పేరున్న రన్నర్స్ పాల్గొన్నారు. వారు వెళ్లే ప్రయాణంలో ఆక్సీజన్ లెవెల్స్ 50 శాతానికి తక్కువగా ఉంటాయి. అలాంటి క్లిష్టపరిస్థితుల్లో కూడా దాదాపు 12 గంటల 28 నిమిషాల పాటు పరుగెత్తి ద్వితీయ స్థానం సంపాదించింది. గతంలో 21 కిలోమీటర్ల కార్గిల్ ఇంటర్నేషనల్ చాలెంజ్ మారథాన్, 42 కిలోమీటర్ల లడఖ్ మారథాన్‌లలో మొదటిస్థానం సంపాదించింది రెఫికా. అదే స్ఫూర్తితో 50 కిలోమీటర్లకుపైగా ఉండే అల్ట్రా మారథాన్స్‌లో పాల్గొనడం హాబీగా మార్చుకున్నది.

271
Tags

More News

VIRAL NEWS