వినూత్న ఆవిష్కరణ


Tue,October 2, 2018 11:04 PM

పబ్లిక్ టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండడంతో చాలా రోగాలు ప్రబలుతాయి. శుభ్రత లేని కారణంగానే మహిళలు అనేకరకాల వ్యాధులకు గురవుతున్నారు. అలాంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ఐఐటీకి చెందిన ఇద్దరు విద్యార్థులు వినూత్న ఆవిష్కరణ చేశారు. అత్యంత చౌకగా దొరికే ఉపకరణాన్ని రూపొందించారు.
sanfe-public-toilet
అపరిశుభ్రమైన మరుగుదొడ్లు వినియోగించినా ఎలాంటి ముప్పు కలుగకుండా ఢిల్లీ ఐఐటీకి చెందిన ఇద్దరు విద్యార్థులు సులువైన పరిష్కారాన్ని అందించారు. శాన్ఫీ అనే ఉపకరణాన్ని వారు రూపొందించారు. బయట ప్రదేశాలలోని మరుగుదొడ్లు 71శాతం వరకూ అపరిశుభ్రంగానే ఉంటున్నాయి. వీళ్లు రూపొందించిన శాన్ఫి ఉపకరణాన్ని వినియోగిస్తే ఎటువంటి సమస్యలు రాకపోవడమేకాకుండా పలు రకాల అంటువ్యాధులకు దూరంగా ఉండొచ్చు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న హ్యారి సెహ్రావత్, అర్చిత్ అగర్వాల్‌లు ఇద్దరూ కలిసి తమ ప్రొఫెసర్ సలహా తీసుకుని శాన్ఫీని రూపొందించారు.


దాదాపు ఆరు నెలల క్రితం వీరిద్దరూ సహ విద్యార్థినిలు ఎదుర్కొంటున్న సమస్యలను గమనించి పరిష్కరించేందుకు ముందుకు వచ్చారు. మహిళల రుతుస్రావ సమయంలోనూ ఉపయోగించేలా తయారు చేశారు. శాన్ఫీను ధరించి నిల్చుని మూత్ర విసర్జన చేసే విధంగా రూపొందించారు. అన్ని వయ సుల వాళ్లు వినియోగించుకునేలా వీటిని ప్రత్యేక డిజైన్‌తో తయారు చేశారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా శాన్ఫీ ధరను రూ.10లకే అందిస్తున్నారు. ప్రస్తుతం ఇవి ఢిల్లీలోని అన్ని ఫార్మసీ షాపుల్లోనూ దొరుకుతున్నాయి. నోయిడాలోని రెడ్‌రూమ్ టెక్నాలజీ సహకారంతో వీటిని రూపొందిస్తున్నారు.

761
Tags

More News

VIRAL NEWS