దిండ్లు శుభ్రంగా లేకపోతే?


Sat,September 8, 2018 01:21 AM

ఇంట్లో వాడుకునే తలదిండ్లను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలి. లేదంటే కొత్త సమస్యలను కొని తెచ్చుకుంటారని అంటున్నారు నిపుణులు. దిండ్లను సులువుగా ఉతకడానికి కొన్ని చిట్కాలు మీకోసం.
pillow
-వాషింగ్ మెషిన్‌లో దిండ్లను ఉంచి బేకింగ్ సోడా, వైట్ వెనిగర్‌ను అందులో వేయాలి. శుభ్రపరిచిన తరువాత ఎండలో ఆరబెడితే దిండ్లకున్న మురికిపోతుంది.
-నీటిని బాగా మరిగించి అందులో నిమ్మరసాన్ని వేసి బాగా కలుపాలి. దిండ్లు మునిగేంత వరకు నీటిని పొయ్యాలి. దిండ్లు నానిన తరువాత డిటర్జెంట్‌తో కడిగితే మురికిపోయి సువాసన వస్తుంది.
-బేకింగ్ సోడా, టీ ఆకుల రసాన్ని బాగా కలిపి పేస్టులా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని దిండ్లపై రాయాలి. బాగా నానిన తరువాత బట్టతో దిండ్లకున్న మిశ్రమాన్ని రుద్దాలి. ఇలా చేయడం వల్ల దిండ్లపై ఉన్న బ్యాక్టీరియా తొలిగిపోతుంది.
-బ్లీచింగ్, బొరాక్స్, డిటర్జెంట్‌ను వేడి నీటితో కలుపాలి. ఈ మిశ్రమం దిండ్లకు పట్టేలా వాషింగ్ మెషిన్‌లో ఉతకాలి. మెషిన్ శుభ్రపరిచిన తరువాత దిండ్లను ఎండలో ఆరబెట్టాలి. ఇలా చేయడం వల్ల దిండ్ల నుంచి చెడు వాసన రాదు.
-నిమ్మరసం, హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను బాగా కలుపాలి. వేడినీటిలో ఈ మిశ్రమాన్ని కలిపి అందులో దిండ్లను నానబెట్టాలి. ఎప్పటిలాగే వాషింగ్ మెషిన్‌లో ఉంచి శుభ్రపరుచుకోవాలి.

360
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles