డిజిటల్ డిటాక్స్ తప్పనిసరి


Wed,September 19, 2018 01:36 AM

ఉదయాయం నిద్ర లేవగానే సోషల్ మీడియాకి అంకితమై పోతున్నారా? రాత్రి పడుకునే ముందు కూడా స్మార్ట్ ఫోన్ చేతిలోనో, పక్కలోనే ఉండాల్సిందేనా? అయితే మీకు డిజిటల్ డిటాక్స్ అవసరమే. ఎందుకంటే ఈ యువతరంలో ఎక్కువ మంది దుర్కొంటున్న సమస్య ఇదే.
Whats-App
ఏం లేకున్నా బతికేస్తాం కానీ, స్మార్ట్‌ఫోన్ లేకుంటే, సోషల్ మీడియాలో టచ్‌లో లేకుంటే బతకలేం అనే స్థితికి వచ్చేసింది యువతరం. ఒక్కరోజులో సగటున 200 సార్లు స్మార్ట్‌ఫోన్‌ను చూస్తున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే ప్రతి ఆరున్నర నిమిషాలకు ఓసారైనా ఫోన్ చూడాల్సిందేనన్న మాట. నలుగురిలో ఒకరైతే నిద్రపోయే సమయం కంటే ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే గడుపుతున్నారు. దీన్ని బట్టే స్మార్ట్ ఫోన్ తెరకు మనం ఎంతగా బానిసలమయ్యామో అర్థం చేసుకోవచ్చు. ఇక 16 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్కుల్లో 70 శాతం మంది మాట్లాడడం కంటే చాటింగ్ చేసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారట.

సగటున ఒక్కో టీనేజర్ బెడ్ మీది నుంచే నెలలో 3,400 మెసేజ్‌లను పంపిస్తున్నాడట. దీంతో డిజిటల్ డిటాక్స్ తెరపైకి వచ్చింది. డిటిజల్ డిటాక్స్ అంటే.. స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా ఉండడమే. అది కొద్ది గంటలైనా కావచ్చు, కొన్ని రోజులు, నెలలైనా కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురిలో ఒకరు స్మార్ట్‌ఫోన్ కారణంగా ఒత్తిడితో బాధపడుతున్నారు. ఈ డిజిటల్ డిటాక్స్‌లో భాగంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ.. ఆ సమయంలో పుస్తకం చదువడం, ఆటలాడుకోవడం, వ్యాయామం చేయడం, ఇంట్లో పనులు చేయడం వంటివి చేసుకోవచ్చు. మీరు నిర్దేశించుకున్న గడువు ముగిసిన తర్వాత మీకు నచ్చితే స్మార్ట్‌ఫోన్‌ను ఓపెన్ చేసుకోవచ్చు. ఈ డిజిటల్ డిటాక్స్ వల్ల ఒత్తిడిస్థాయిలు 27శాతం వరకూ తగ్గినట్లు పరిశోధకులు చెబుతున్నారు.

642
Tags

More News

VIRAL NEWS

Featured Articles