పసుపుతో చర్మకాంతి!


Fri,November 16, 2018 11:07 PM

కొందరికి జిడ్డు చర్మం, మరికొందరికి పొడిబారిన చర్మం, మొటిమలతో విసుగుచెందుతుంటారు. పసుపు యాంటీబయాటిక్‌గా చర్మ సమస్యలను పోగొడుతుంది. ఈ కింది చిట్కాలను ప్రయత్నించి చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోండి.

Skin-Care
-పసుపు, నిమ్మరసం, శనగపిండి మూడింటినీ బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని మెడ, ముఖానికి రాయాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడుగాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల చర్మంపై జిడ్డు పోతుంది.
-నిమ్మరసం, పెరుగు, పసుపుని బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడుగాలి. వారానికి మూడుసార్లు ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.
-దోసకాయ రసం, పసుపుని సమానంగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని మెడ, ముఖానికి రాయాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రపరుచాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.
-బియ్యంపిండి, తేనె, నిమ్మరసం, కొంచెం పసుపు వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 30 నిమిషాల తరువాత నీటితో కడుగాలి. తరుచూ ఇలా చేస్తే చర్మం మెరిసిపోతుంది.

379
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles