రాజసంగా.. రాకుమారిలా!


Sat,September 8, 2018 01:41 AM

చిన్నా.. పెద్ద తేడా లేకుండా.. ఫంక్షన్.. పార్టీ అనే భేదం రాకుండా.. ఎక్కడ చూసినా లెహంగాల హంగామే నడుస్తున్నది.. సంగీత్‌కి ఒకలా.. రెసెపెన్లలో మరోలా.. మెరిసేందుకే మొగ్గుచూపుతున్నారు మగువలు.. అందుకే మిమ్మల్ని రాకుమారిలా మార్చేందుకు.. ఈ లెహంగాల కలెక్షన్‌లను తీసుకొచ్చాం..
Fashan
1. రాజకుమారిలా మెరిసేందుకు ఈ డ్రెస్ వేయాల్సిందే! పసుపు రంగు సాఫ్ట్ నెట్ ఇది. దీనిమీద జర్దోసీతో నాలుగు లైన్లుగా కట్ వర్క్ చేశాం. లెహంగా మొత్తం అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్‌తో నింపేశాం. ఇదే రంగు నెట్ దుపట్టాకి కూడా ఇదే వర్క్ కంటిన్యూ చేశాం. యెల్లో కలర్ నెట్ బ్లౌజ్ మీద కూడా ఇదే వర్క్ హెవీగా నింపేయడంతో సూపర్‌గా కనిపిస్తున్నది.

2. కాంట్రాస్ట్ ఎప్పటికీ వర్కవుట్ అవుతుంది. అందులో ఈ కాంబినేషన్ అదుర్స్. గ్రీన్ కలర్ నెట్ లెహంగా, బ్లౌజ్ ఇది. ఈ రెండింటి మీద జర్దోసీతో పువ్వుల డిజైన్‌తో హెవీగా నింపేశాం. పింక్ కలర్ నెట్ దుపట్టా మీద కూడా ఇదే వర్క్ ఇచ్చాం. కాకపోతే కట్ వర్క్ బార్డర్ దీనికి అదనపు ఆకర్షణను తీసుకొచ్చింది.
Fashan1
3. పార్టీల్లో ప్రత్యేకంగా కనిపించేందుకు ఈ లెహంగా ఎంచుకోండి. పీచ్ కలర్ నెట్ లెహంగా క్రీపర్, జర్దోసీ వర్క్ చేశాం. లెహంగా మొత్తం ఇదే వర్క్ చేయించాం. గోల్డెన్ బార్డర్ దీనికి అదనపు ఆకర్షణ. ఇదే రంగు నెట్ దుపట్టా మీద కట్ వర్క్‌తో నింపేశాం. రాసిల్క్ పీచ్ బ్లౌజ్ మీద సీక్వెన్స్, జర్కోన్, గ్లాస్, కట్ బీడ్స్‌తో హెవీగా వర్క్ చేయించాం.

4. ఆకుపచ్చని నెట్ లెహంగా పైన మిర్రర్ వర్క్ చేశాం. మూడు లైన్లుగా కట్‌వర్క్ ఇచ్చాం. నెట్ బ్లౌజ్ మీద మిర్రర్ బుటీస్ ఇచ్చి, దుపట్టాకి కూడా కట్ వర్క్ చేయడంతో అందంగా మెరిసిపోతున్నది. ఇదే రంగు నెట్ దుపట్టా మీద జర్దోసీ, మిర్రర్ వర్క్ ఇవ్వడంతో చూడముచ్చటగా ఉంది.

వి. స్వాతి
స్వాతి వెల్దండి డిజైన్ స్టూడియో
బంజారాహిల్స్, హైదరాబాద్
8179668098

916
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles