నున్నటి జుట్టుకోసం..


Mon,January 22, 2018 12:38 AM

కొంతమందికి జుట్టు తరుచూ రేగిపోతూ ఉంటుంది. ఎంత దువ్వినా కుదురుగా ఉండదు. ఏం చేస్తే నున్నటి జుట్టు సొంతమవుతుందో తెలుసా? అయితే తెలుసుకోండి..
hair
-అలోవెరా జెల్‌లో సహజసిద్ధమైన మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. కాబట్టి అలోవెరా జెల్‌ని జుట్టుకు రాయడం వల్ల జుట్టు రేగడం తగ్గిపోయి కుదురుగా ఉంచుతుంది.
-ఎక్కువ నూనె కాకుండా.. కొద్దిగా ఆల్మండ్ నూనెను జుట్టుకు రాస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇది రేగిన జుట్టును సరిచేయడమే కాదు.. శిరోజాల సౌందర్యాన్ని పరిరక్షిస్తుంది.
-అన్ని రకాల జుట్టు సమస్యలకు ఆపిల్ సైడర్ వెనిగర్‌తో చక్కటి పరిష్కారం. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రేగడాన్ని అరికడుతాయి. వారానికొకసారి ఈ ప్యాక్ వేస్తూ ఉండండి.
-పెరుగు ద్వారా శిరోజాలకు తగినంత తేమ లభిస్తుంది. జుట్టు మూలాల నుంచి పోషణ లభిస్తుంది.
-కోడిగుడ్డులోని తెల్లసొనను వాడడం ద్వారా జుట్టు మృదువుగా మారుతుంది. ఇందులో నిమ్మరసం కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

719
Tags

More News

VIRAL NEWS