టూర్‌కి తీసుకెళ్లే పక్షి!


Wed,September 12, 2018 01:07 AM

గూగుల్ ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌గా మిగతా ప్లాట్‌ఫామ్స్ కంటే వేగంగా దూసుకుపోతున్నది. పర్యాటకాన్ని ఇష్టపడే వారికోసం ఇప్పుడు ప్రత్యేకంగా ఒక ట్రావెల్గైడ్ వెబ్‌సైట్ లాంచ్ చేసింది.
touring_bird
ఏదైనా టూర్‌కి వెళ్లాలనుకున్నప్పుడు అక్కడి విశేషాలు, ప్రత్యేకతలు ఎవరి ద్వారానైనా తెలుసుకొని వెళ్తాం. లేదంటే గూగుల్‌లో, వికీపీడియాలో సెర్చ్ చేస్తాం. కాకపోతే మనం తెలుసుకున్న దానికి అక్కడికి వెళ్లి చూసిన దానికి కొంత తేడా ఉండవచ్చు. ఇలాంటి సమస్యకు చెక్ పెట్టడానికి గూగుల్ ఓ సరికొత్త ఆవిష్కరణ చేసింది. టూరింగ్‌బర్డ్ పేరుతో ఒక వెబ్‌సైట్ ప్రారంభించింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా పలు పర్యాటక ప్రదేశాలు, అక్కడి విశేషాలు ఇతర అంశాలు పొందుపరిచి ఉంటాయి.

ఇలాంటి టూరింగ్ వెబ్‌సైట్లు ఇప్పటికే చాలా ఉన్నప్పటికీ పక్కా సమాచారంతో గూగుల్ లాంచ్ చేసింది కాబట్టి దీనికో ప్రత్యేకత ఉంటుంది. ఈ వెబ్‌సైట్‌లో మనం ఒక టూరిస్ట్ స్పాట్ సెలక్ట్ చేసుకోగానే.. అక్కడ పాపులర్ ఏంటి? అక్కడికి వెళ్లిన తర్వాత ఎలా నడుచుకోవాలి? ఏం చేయాలి? ఏం చేయొద్దు, అక్కడి ధరలు, వంటకాలు, స్థానిక భాష, అలవాట్లు, అక్కడి సంప్రదాయాలు లాంటి సమాచారమంతా తెర మీద కనిపిస్తుంది. అప్పటికప్పుడు అప్‌డేటెడ్ సమాచారం ఈ వెబ్‌సైట్‌లో మనకు లభిస్తుంది. అంతేకాదు.. త్వరలో యాప్ కూడా అందుబాటులోకి రానుంది.

590
Tags

More News

VIRAL NEWS