మానిటర్ కొంటున్నారా?


Tue,January 16, 2018 11:04 PM

ఇప్పుడు అందరి ఇళ్లలోనూ కంప్యూటర్‌లు, ల్యాప్‌టాప్‌లు కామన్ అయిపోయాయి. అయితే మానిటర్ కొనేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే..
moniter
-డిస్‌ప్లేలలో మూడు రకాలు ఉంటాయి. అవి టీఎన్, ఐపీఎస్, వీఏ. కొత్తగా మానిటర్ కొనుగోలు చేసే సమయంలో ఈ మూడింటి పనితీరు పరిగణనలోకి తీసుకోవాలి.
-ట్విస్టెడ్ నెమోటిక్(టీఎన్) డిస్ ప్లే మానిటర్స్‌కు రెస్పాన్స్ టైమ్ వేగంగా ఉంటుంది. అయితే వ్యూ యాంగిల్స్ అంతగా బాగుండవు. మీరు గేమ్స్ కోసం కావాలనుకుంటే ఈ స్క్రీన్ మంచి ఆప్షన్.
-ఇన్ ప్లేన్ స్విచ్చింగ్(ఐపీఎస్) ప్యానెల్స్‌కు కలర్ రీప్రొడక్షన్ క్యాపబులిటీ ఉంటుంది. కానీ రీఫ్రెష్ చాలా స్లోగా అవుతుంది. ఫొటోగ్రాఫర్, గ్రాఫిక్ డిజైనర్స్ కోసమైతే ఈ డిస్‌ప్లే ఎంచుకోవచ్చు.
-వర్టికల్ అలైన్‌మెంట్ ప్యానెల్స్(వీఏ)లో టీఎన్, ఐపీఎస్‌లో ఉన్న అడ్వాంటేజ్‌లన్నీ ఉంటాయి. మంచి వ్యూ యాంగిల్స్, కాంట్రాస్ట్ వంటి ప్రయోజనాలున్నాయి. మీరు రైటర్స్ అయినా, వైబ్ బ్రౌజింగ్ కోసమే అయితే ఈ మానిటర్‌ని తీసుకోండి.
-సాధారణంగా రెస్పాన్స్ టైమ్‌ను మిల్లీ సెకండ్స్‌లో లెక్కిస్తారు. కాబట్టి మానిటర్ కొనుగోలు సమయంలో లోయర్ రెస్పాన్స్ టైమ్ ఉన్న మానిటర్ ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. దీని ద్వారా ఇమేజ్ తేడాలు క్విక్ యాక్షన్ మూవీస్, గేమ్స్ ఆడే సమయంలో ఇబ్బందులు రావు.
-మానిటర్‌కు డీవీఐ, హెచ్‌డీఎమ్‌ఐ పోర్టులు కూడా ఉండేలా చూసుకోవాలి. హెచ్‌డీఎమ్‌ఐ పోర్టు సహాయంతో కామ్ కార్డర్, డిజిటల్ కెమెరా, మీడియా ప్లేయర్ వంటి డివైజ్‌లను మానిటర్‌కి నేరుగా కనెక్ట్ చేసుకొని మానిటర్‌లోనే చూడవచ్చు.

159
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles