అవార్డు గెలుచుకుంది!


Mon,July 24, 2017 01:09 AM

SheetalDugar
అతి ఖరీదైన ఓరో ఇలియోస్ హురాకా కారు కలిగిన మహిళగా ఈమె అప్పట్లో వార్తల్లో కెక్కింది. కారు కొనగానే సరిపోదు కదా.. దాన్ని నడిపే బాధ్యతే కాదు.. పరిగెత్తించే బాధ్యత కూడా తీసుకున్నది. రేస్‌లతో మొగవారిని సైతం చిత్తు చేస్తున్నది. అందుకే ఆమెకు ఇప్పుడు ఒక అవార్డు కూడా వరించింది.
అక్షరాలా 3.32 కోట్ల రూపాయల కారు అది. రేస్‌ల కోసం మాత్రమే వాడే కారుని ఆమె భర్త గిఫ్ట్‌గా ఇచ్చాడు. 5.2ఎల్ వీ10 ఇంజిన్ కెపాసిటీ ఉన్న కారును నడుపాలంటే చాలామంది సంశయిస్తారు. కానీ ఈమె మాత్రం గంటకు 315 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతున్నది. కలకత్తా ఫాసెస్ట్ ఫిమేల్ డ్రైవర్ అన్న బిరుదు కూడా ఈమె సొంతం. ఇప్పుడు ఒక ఫౌండేషన్ రాజస్థాన్ అన్‌మోల రత్న అవార్డు ఇచ్చి సత్కరించింది. పందొమ్మిదేళ్ల వయసులోనే పెళ్లయింది. భర్త సహకారంతో కారు డ్రైవింగ్ నేర్చుకున్నది. అప్పటి నుంచి డ్రైవర్ మీద ఆధారపడకుండా ఆమె సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నది. ఒకరోజు రేసర్ అవ్వాలనే ఆలోచన పుట్టింది. దానికి భర్త కూడా ఓకే చెప్పడంతో రేసర్ అవ్వాలన్న ఆమె కలలు నిజమయ్యాయి. రేసింగ్ చేయాలంటే మంచి కారు ఉండాలని అతి ఖరీదైన కారును శ్రీమతికి బహుమతిగా ఇచ్చాడు. దాంతో ఆమె ఎన్నో విజయాలను చవిచూసింది. చూస్తుంది కూడా!

379
Tags

More News

VIRAL NEWS