వేసవిలో శక్తినిచ్చే ఆహారాలు


Wed,May 16, 2018 11:44 PM

Summer-Foods
-సోయాబీన్‌లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అతి తక్కువ ధరలో ఎక్కువ పోషకాలను వీటి ద్వారా పొందవచ్చు. సోయాబిన్స్‌లో విటమిన్ బి, మినరల్స్ ఒంటికి శక్తినిస్తాయి. అంతేకాకుండా ఇవి శరీరాన్ని చల్లబరుస్తాయి.
-చిక్కుళ్లలో థియమైన్, రిబోఫ్లోవిన్, కాల్షియం, జింక్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. అధిక పోషక విలువలు కలిగిన వీటిని తీసుకుంటే శక్తితోపాటు శరీరం లోపల వేడిని కూడా తగ్గిస్తాయి.
-బ్రకోలీలో రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యం ఉంది. దీనిని నిత్యం తీసుకోవడం వల్ల క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది. శరీరంలోని చెడుకొవ్వును తగ్గించడంలో, జీర్ణవ్యవస్థను మెరుగుపర్చడంలో బ్రకోలీ సహాయపడుతుంది.
-పనీర్‌లో విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కాల్షియంను శరీరానికి అందిస్తుంది. 100 గ్రాముల పనీర్‌లో 18 గ్రాముల ప్రోటీన్, కాల్షియం ఉంటుంది.
-తృణధాన్యాల్లో మాంసకృత్తులు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ అధిక మోతాదులో ఉంటాయి. ఇవే కాకుండా ఫాస్ఫరస్, ఐరన్, జింక్ ఇతర ఖనిజాలు వీటిల్లో ఉంటాయి.
-వీటిని రెగ్యులర్ డైట్‌లో చేర్చుకుంటే శరీరానికి తక్షణ శక్తినివ్వడమే కాకుండా.. శరీరాన్ని వేసవిలో చల్లబరుస్తాయి.

393
Tags

More News

VIRAL NEWS