తెల్లని విషపదార్థాలు!


Wed,June 6, 2018 10:46 PM

కొందరు అన్నం తెల్లగా మల్లెపువ్వుల్లా ఉంటే తప్ప ముద్ద పెట్టుకోరు. పిండి, చక్కెర, ఉప్పు వంటివి తెల్లగా ఉంటేనే శుభ్రంగా ఉన్నట్లు భావిస్తారు. కానీ రిఫైన్డ్ పదార్థాల్లో పోషక విలువలు ఏమాత్రం ఉండవు సరికదా, వాటిని తింటే ప్రాణాంతక వ్యాధులు వస్తాయంటున్నారు నిపుణులు.
poioson

పిండి

రిఫైన్ చేయబడిన గోధుమపిండి లేదా మైదాపిండిలో అల్లోగ్జాన్ అనే ప్రమాదకర రసాయనం కలుస్తుంది. ఇది క్లోమంలో ఉండే కణాలను నాశనం చేస్తుంది. అంతేకాదు.. దీనివల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

sugar

చక్కెర

చక్కెరను తయారీలో భాగంగా రిఫైన్ చేస్తుంటారు. దీనివల్ల 90శాతం పోషక విలువలు నాశనమవుతాయి. దీనికి తోడు అలాంటి చక్కెరలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చక్కెర తింటే ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లో పడేసినట్లే!

milk

పాలు

పాలను పాయిశ్చరైజర్ చేస్తారు. పాలు తెల్లగా కనిపించేందుకు.. కొన్నిసార్లు ఈ పాయిశ్చరైజేషన్ మరీ ఎక్కువ చేస్తారు. అప్పుడు అందులో ఉండే విటమిన్లు, ఎంజైమ్‌లు నాశనమవుతాయి. మిగిలిన 10శాతం పోషకాలు మనకు ఎందుకూ పనికిరావు. పాలల్లో కలిపే ప్రమాదకర రసాయనాల వల్ల మలబద్దకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.

salt

ఉప్పు

రిఫైన్ చేసిన ఉప్పు తింటే గుండె సంబంధ వ్యాధులు వస్తాయి. బీపీ ఎక్కువవుతుంది. ప్రమాదకర కెమికల్స్ శరీరంలోకి వెళ్లి మరిన్ని అనారోగ్యాలు వచ్చి పడుతాయి.

rice

బియ్యం

తెల్లగా ఉండాలని ఎక్కువ పాలిష్ చేస్తుంటారు. ఇలా చేసే క్రమంలో బియ్యంలో ఉండే ఫైబర్, ఇతర పోషకాలు నాశనమవుతాయి. ఇలా వండిన అన్నాన్ని తినడం వల్ల డయాబెటిస్ వస్తుంది.

2888
Tags

More News

VIRAL NEWS